https://oktelugu.com/

RRR: ఆర్​ఆర్​ఆర్ గ్రాండ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథులుగా ఆ ఇద్దరు టాప్​ సీనియర్​ హీరోలు

RRR: టాలీవుడ్​తో పాటు ఇండియన్​ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, ఓలివియా మోరిస్​, శ్రియా శరణ్​, అజయ్​ దేవగణ్​, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, గలింప్స్​, పాటలు అభిమానులను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 12:44 PM IST
    Follow us on

    RRR: టాలీవుడ్​తో పాటు ఇండియన్​ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, ఓలివియా మోరిస్​, శ్రియా శరణ్​, అజయ్​ దేవగణ్​, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు, గలింప్స్​, పాటలు అభిమానులను ఎంతగానో ఆక్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ అయితే యూట్యూబ్​నే షేక్ ఆడిస్తోంది.

    RRR

    Also Read: RRR: రామ్​ మేకోవర్​ అదుర్స్​.. సీతారామరాజు పాత్రకోసం ఇంతలా కష్టపడ్డాడా?

    ప్రమోషన్స్​లో వేగం పెంచిన జక్కన్న.. ఇటీవలే బాలీవుడ్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్​గా నిర్వహించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్​లో ఈ కార్యక్రమాన్ని​ అంతకు మించి అన్నట్లుగా నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అయితే, బాలీవుడ్​లో ఈవెంట్ ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్ రాగా.. టాలీవుడ్​లోనూ అంతే రేంజ్​లో ఉన్న టాప్​ హీరోలను పిలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలను ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పిలివనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    ఇందులో రామ్​చరణ్​, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీతారామరాజు పాత్రలో రామ్​ నటిస్తుండగా.. కొమరమ్ భీమ్ పాత్రలో తారక్​ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్​, శ్రియ, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుంగా సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

    Also Read: RRR vs Radheshyam: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?