Husband and Wife : భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. కానీ దీని గురించి తెలియక చాలామంది దంపతులు నిత్యం రోగాలు పడుతూ ఉంటారు. ఒకరికి ఒకరు అర్థం చేసుకోలేక ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారు. కానీ దంపతులు ఇద్దరు ఒకే దారిలో నడవడం వల్ల ఇద్దరు సంతోషంగా ఉంటారు అని విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఇద్దరి మధ్య ఏదో చిన్న పొరపాటు వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఎవరి కోపాన్ని ఎవరు తగ్గించాలి? అనే విషయాల్లో కి వెళ్తే..
Also Read : భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలి? పెళ్లి ఏ వయసులో చేసుకోవాలి?
అలకలు:
భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఉన్నా కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వస్తాయి. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు అలక తో ఉంటారు. ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా అలకతో ఉండడం వల్ల ఇల్లు చిన్న పోయినట్లు అవుతుంది. అయితే ఇలాంటి సమయంలోనే భర్త ముందు అడుగు వేసి వారి అలకమానిపించాలి. వారితో ఏకాంతంగా మాట్లాడి.. సమస్య పరిష్కరించుకోవాలి. లేకుంటే ఇది ఇలాగే కొనసాగితే గొడవ పెద్దదిగా మారే అవకాశం ఉంది. అందువల్ల ఇది చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి.
వాదనలు:
దంపతులు ఇద్దరు మధ్య కొన్ని విషయాల్లో వాదనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే సమయంలో తామంటే తాము ఎక్కువ అని వాదిస్తూ ఉంటారు. ఈ వాదనలో కూడా నిజాయితీ ఉంటే ఎవరో ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. అలా కాకుండా అబద్ధాలు చెబుతూ ఆధిపత్యం కోసం అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల ఇద్దరు మధ్య దూరం పెరుగుతుంది. ఈ దూరం శాశ్వతంగా కూడా మారే ప్రమాదం ఉంది.. అందువల్ల వాదనలు జరిగిన అందులో నిజాయితీగా ఉండి ఎదుటివారిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇతని మధ్య ఉండే గొడవ సమసి పోతుంది.
ఎదుటివారి కష్టం వినాలి:
భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక కష్టాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకోలేరు. తన కష్టాన్ని అర్థం చేసుకోలేదని బాధతో వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇలా కాకుండా ఎదుటివారు ఏం చెప్తారో పూర్తిగా వినాలి. ఆ తర్వాత సమస్య గురించి ఇద్దరు చర్చించుకోవాలి. అయితే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలను ఇతరులకు చెప్పకుండా దంపతులు ఇద్దరు మాత్రమే చర్చించుకోవడం వల్ల పరిష్కారం అవుతుంది. ఒకవేళ ఇతరులకు చెప్పడం వల్ల ఈ గొడవ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ప్రేమ తగ్గదు:
చాలామంది దంపతులు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ద్వేషంగా మారుతుంది. అయితే గొడవలు జరిగినప్పుడు తమ ద్వేషాన్ని పక్కనపెట్టి ప్రేమలను గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా తాను ప్రేమగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశారో ఆ పనులను గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేయడం వల్ల ఎదుటివారి మనసులో ద్వేషాన్ని తగ్గించవచ్చు. ఫలితంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలా కాకుండా బెట్టు చేస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read : భార్యభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలి? ఎక్కువ ఉంటే ఏమవుతుంది?