Couples
Husband And Wife: సృష్టిలో దాంపత్య జీవితం చాలా అందమైనది. ఇద్దరు తెలియని వ్యక్తులు జవితాంతం తోడుండడానికి పెళ్లి ద్వారా బంధం ఏర్పాటు చేసుకుంటారు. ఈ బంధం ఎన్నో ఆటు పోట్లు, కష్ట నష్టాలు, సుఖ శాంతులు అనుభవిస్తూ ముందుకు వెళ్తుంటుంది. అయితే పెళ్లయిన ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది అని చెప్పలేం. కాన చాల వరకు మాత్రం ఈ బంధం శాశ్వతంగానే ఉంటుంది. ఒకప్పుడు పెళ్లిని పెద్దలు నిర్ణయించేవారు. వీరు భయం, భక్తితో ఎన్ని కష్టాలు వచ్చినా.. శాశ్వతంగా కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడే స్వేచ్ఛా ప్రపంచంలో ఉన్నందున కొందరు ఎవరి పెళ్లిని వారే నిర్ణయించుకుంటున్నారు. దీంతో ఒకరి భావాలకు మరొకరు ఓర్చుకోలేక ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. అయితే కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం పెళ్లి చేసుకునే సమయంలో భార్య, భర్తల మధ్య వయసు తేడా ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అసలు దంపతుల మధ్య వయసు ఎంత వరకు వ్యత్యాసం ఉండాలి? దీనిపై పెద్దలు, సైన్స్ ఏం చెబుతోంది?
పూర్వ కాలంలో పెద్దలు పెళ్లిళ్లు నిర్ణయించే సమయంలో అబ్బాయి వయసు పెద్దదిగాను.. అమ్మాయి వయసు చిన్నదిగాను ఉండేలా చూసుకున్నారు. అబ్బాయి వయసు పెద్దదిగా ఉండడం వల్ల కుటుంబ బాధ్యతను తీసుకుంటాడని, దీంతో అమ్మాయి కంటే అబ్బాయి ముందే పరిపక్వత చెందడం వల్ల కుటుంబానికి అండగా ఉంటారని భావించారు. కానీ కొన్ని పెళ్లిళ్లు భారీ వయసు తేడాతో జరిపించారు. ఆ కాలంలో అబ్బాయికి, అమ్మాయికి కనీసం 10 ఏళ్ల పాటు వ్యత్ాయసం ఉండేలా చూశారు.
అయితే సైన్స్ కూడా భార్య భర్తల మధ్య వయసు తేడా ఉండం మంచిదేనని తెలుపుతోంది. కాన భార్యభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండకూడదని తెలుపుతోంది. అబ్బాయి, అమ్మాయి వయసులో కనీసం ఐదేళ్ల పాటు తేడా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. దీంతో ఒకరి మనస్తత్వాలు మరొకరు అర్థం చేసుకుంటారు. ఈ వయసు తేడాతో ఒకరి అలవాట్లు మరికొరు ఇష్టపడుతారు. దీంతో ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగి అన్యోన్యంగా జీవిస్తారు.
వాస్తవానికి అబ్బాయి కంటే అమ్మాయిల్లోనే ముందుగా హార్మన్ల ప్రభావం మొదలవుతుంది. అమ్మాయిల్లో 8 నుంచి 13 ఏళ్ల లోపు ఈ పరిస్థితి ఉండగా.. అబ్బాయిలో 9 నుంచి 15 ఏళ్లలోపు హర్మోన్ల ప్రభావం ఉంటుంది. అయితే ఇవి ప్రారంభం కాగానే పెళ్లి చేయాలనే ఉద్దేశం కాదు. వారి మనస్తత్వం కూడా పరిపక్వత చెందాలి అని మానసిక నిపుణుల చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైతం కనీస వివాహ వయసుతో అబ్బాయిలకు 25, అమ్మాయిలకు 21 ఏళ్లు వివాహ యవసుగా నిర్ణయించారు. ఈ సమయంలో వారి చదువు పూర్తవుతుంది. ఆ తరువాత కెరీర్ ప్రారంభం అవుతుంది. ఇదే సమంలో జీవితంలో స్థిరపడినట్లయితే పెళ్లి చేసుకోవచ్చని సైన్స్ చెబుతోంది. అయితే కొందరు అమ్మాయి వయసు పెద్దదిగా ఉన్నా వివాహం చేసుకుంటున్నారు. కాని ఇవి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.