Wife and Husband
Husband and Wife: భారత సమాజంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పురాతన కాలంలో వివాహాన్ని ప్రత్యేక వేడుకలా నిర్వహించుకునేవారు. ఒకప్పుడు పెళ్లిని ఐదు రోజులపాటు నిర్వహించుకునేవారు. అయితే ఆ తర్వాత సమయం లేకపోవడంతో పాటు.. కొన్ని పనుల కారణంగా వివాహం జరుపుకునే రోజులను తగ్గించుకుంటున్నారు. అయితే ఈ వివాహాన్ని ఒకప్పుడు పెద్దలు నిర్ణయించేవారు. అబ్బాయి అమ్మాయి మధ్య నిర్ణీత వయసు మధ్య దూరం నుంచి పెళ్లి చేసేవారు. అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని భావించి.. అమ్మాయి కంటే అబ్బాయి వయసు కనీసం 10 సంవత్సరాలు ఎక్కువగా ఉండేలా నిర్ణయించేవారు. కానీ ఆ తర్వాత నేటి కాలంలో అబ్బాయి అమ్మాయి సరి సమాన వయసుతో ఉండాలని అనుకుంటున్నారు. మరికొన్ని పెళ్లిళ్లలో అబ్బాయి కంటే అమ్మాయి వయసే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. అయితే అబ్బాయి, అమ్మాయి మధ్య వయసు తేడా ఎంత ఉండాలి? అలా ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత కాలంలో కొన్ని పెళ్లిళ్లు పెద్దలు నిర్ణయిస్తే.. మరికొన్ని పెళ్లిళ్లు మాత్రం సొంతంగా చేసుకుంటున్నారు. కొందరు ప్రేమలో పడి ఆ తర్వాత తమ వయసు కూడా చూసుకొని పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వయసు కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉండేలా చూసుకుంటున్నారు. కానీ పెద్దలు నిశ్చయించే కొన్ని పెళ్లిళ్లలో మాత్రం 7 నుంచి 10 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది. పెద్దలు చెబుతున్న ప్రకారం అమ్మాయి కంటే అబ్బాయి వయసు పెద్దదిగా ఉంటే కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుందని అంటుంటారు.
దీనిని సైంటిఫిక్ గా కూడా నిరూపించారు.. అయితే సైంటిఫిక్ ప్రకారం అబ్బాయి కంటే అమ్మాయి శరీరంలో హార్మోన్లు ముందే ప్రారంభమవుతాయి. అబ్బాయిల్లో 9 నుంచి 15 సంవత్సరాల లోపు హార్మోన్లు ప్రారంభమైతే అమ్మాయిల్లో ఏడు నుంచి 13 సంవత్సరాల లోపు మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే మానసికంగా ముందుగా వృద్ధి చెందుతారు..భారతీయ వివాహ చట్టం ప్రకారం.. అబ్బాయి వయసు 21 సంవత్సరాల వయసు ఉండాలి. అమ్మాయి 18 ఏళ్ల వయసు ఉండాలని నిర్ణయించబడింది. ఇద్దరి మధ్య కనీసం మూడేళ్ల గ్యాప్ ఉండాలని పేర్కొనబడింది.
అయితే పెళ్లి చేసుకోబోయే వారి మధ్య వయసు ప్రధానం కాదని.. వారి మనస్తత్వాలు వృద్ధి చెందాలని నిపుణులు అంటున్నారు. ఇద్దరి మధ్య గౌరవం, అన్యోన్యత ఉంటే వయసు ఎలా ఉన్నా పర్వాలేదని అంటున్నారు. అందులో భాగంగానే కొందరు అబ్బాయిల కంటే అమ్మాయిలు వయసు పెద్దగా ఉన్న వారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు చూస్తున్నారు. అయితే పెద్దలు చెబుతున్న ప్రకారం కుటుంబ బాధ్యత మోసేది అబ్బాయిలు అని, వారి వయసు పెద్దగా ఉంటే కుటుంబ బాధ్యతగా ఉంటారని అంటున్నారు. భారతీయ వివాహ చట్టం ప్రకారం కూడా అమ్మాయి కంటే అబ్బాయి వయసు పెద్దగా ఉండాలని చెబుతుంది. ఈ తరుణంలో అమ్మాయి కంటే అబ్బాయి వయసు మూడు లేదా ఐదు సంవత్సరాల గ్యాప్ తో పెళ్లి చేసుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.