Jobs: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో కూడా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. అకడమిక్ మెరిట్ స్కోర్ ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,000 రూపాయలు స్టైఫండ్ గా లభించనుందని సమాచారం అందుతోంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది ఎంపిక జరగనుంది.
2022 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది ఎంపిక ప్రక్రియ జరగనుంది. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.