RCB IPL Final: క్రికెట్లో గెలవాలంటే ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేయాలి. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు మించి ఆడాలి. కానీ ఐపీఎల్లో బెంగళూరు అభిమానులు అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమజట్టు ఎలాగైనా గెలవాలని.. రెండవసారి కూడా ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఫైనల్ వెళ్లడమే ఆలస్యం జట్టు మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ నగరాన్ని మొత్తం ఎరుపు మయం చేశారు. ఆర్ సి బి జెర్సీలు వేసుకొని అక్కడ సందడి చేస్తున్నారు. అంతేకాదు ఈసారి కూడా కప్ మాదే అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతటితోనే ఆర్సిబి అభిమానులు ఆగిపోవడం లేదు. వారు మరింత జోరు చూపిస్తున్నారు. అహ్మదాబాద్ నగరంలో మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాలలో ఆర్ సి బి ఆర్ సి బి అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు సమీపంలో ఉన్న ఆలయాలలో పూజలు కూడా చేస్తున్నారు.
బెంగళూరులో ఉన్న ఆర్సిబి అభిమానులు అన్ని ఆలయాలలో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అదే కాదు హోమాలు జరుపుతున్నారు. పూజారులతో మంత్రాలు, తంత్రాలు నిర్వహిస్తూ.. తమ జట్టు మీద ఉన్న ప్రేమను నిరూపించుకుంటున్నారు. ఐపీఎల్ లో బలమైన అభిమానుల నేపథ్యమున్న జట్లలో బెంగళూరు ముందు వరుసలో ఉంటుంది. ఈ జట్టుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. గత సీజన్లో ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విలువ భారీగా పెరిగిపోయింది. ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటన మినహాయిస్తే.. మిగతా అన్ని సందర్భాలలో జట్టుకు బెంగళూరు అభిమానులు అండగా ఉన్నారు. సోషల్ మీడియాలో లక్షలలో గ్రూపులు నిర్వహిస్తున్నారు. అదే కాదు చెన్నై, హైదరాబాద్, ముంబై జట్లను మించిపోయే విధంగా తమ సత్తా ఏమిటో బెంగళూరు అభిమానులు చూపిస్తున్నారు. అందువల్లే ఐపిఎల్ లో బెంగళూరు అత్యంత విలువైన జట్టుగా కొనసాగుతోంది. ఇక యువతులయితే సోషల్ మీడియాలో విపరీతంగా సందర్శిస్తున్నారు. ఈసారి కప్ మాదే అంటూ నినాదాలు చేస్తున్నారు. మైదానంలోకి మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవాళ్లే వస్తున్నారు. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో గుజరాత్ అభిమానుల కంటే బెంగళూరు అభిమానులే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం విశేషం.
Rcb fans performing special hawan for RCB win tonight pic.twitter.com/Gpry8345Gh
— (@Spiritualkohli) May 31, 2026
