Tanikella Bharani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అద్భుతమైన పాత్రలో తెలుగు, కన్నడ, హిందీ, భాషలలో సుమారు 750 చిత్రాలకు పైగా నటించిన తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి పాత్రలో తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన తనికెళ్ల భరణి తాజాగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ళభరణి తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఒక ఫైట్ మాస్టర్ తనని దారుణంగా అవమానించారని, ఈ సందర్భంగా భరణి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తనికెళ్ల భరణి వివాహం చేసుకొని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు తను రాళ్ళపల్లి ఇంటిలో అద్దెకి ఉండేవాడిని అని చెప్పాడు.
Also Read: వారు ఉన్నందుకు గర్వపడుతున్నా – సమంత
అయితే ఆ ఇంటికి వచ్చిన ఫైట్ మాస్టర్ భీమరాజు అనే వ్యక్తి ఏంటయ్యా కొత్తగా పెళ్లయింది ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారు, అంటూ నవ్వుతూ మాట్లాడుతూ.. నాకు పెద్ద ఇల్లు ఉంది, పెద్ద గ్రౌండ్ ఫ్లోర్ అమ్మాలి అనుకుంటున్నాను. నీకు కొనాలి అనిపిస్తే.. వచ్చి చూడండి అంటూ చెప్పాడు. వెళ్లి చూస్తే ఇల్లు నచ్చింది అట.
దాంతో, అప్పట్లోనే లక్ష రూపాయలు చెల్లించి ఒక సంవత్సరం పాటు ఆ ఇంట్లో ఉన్నారట. పైగా ఆ ఆరు నెలల పాటు భరణికి ఎలాంటి అమౌంట్ రాలేదట. అలాంటి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫైట్ మాస్టర్ వచ్చి తన ఇంటికి చెల్లించాల్సిన డబ్బులు మొత్తం చెల్లించాలని ఎంతో ఒత్తిడి చేశాడట.
ఇప్పటికిప్పుడు అంత మొత్తంలో డబ్బు కంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి నా పరిస్థితి కూడా ఇదే అని చెప్పినప్పటికీ వినకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమన్నాడని.. అతను ఆ మాట అనేసరికి తనికెళ్ళ భరణి తన డబ్బులను తనకు తిరిగి ఇవ్వమని అడిగిన కూడా ఇవ్వకుండా తన ఇంటి నుంచి వెళ్లిపొమ్మని
చెప్పారు.
ఆ విధంగా అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిన తనికెళ్ల భరణి తన డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి.. అతని దగ్గర నుంచి 75 వేల వరకు మాత్రమే తిరిగి
తీసుకున్నానని.. అతనికి పక్షవాతం వచ్చి ఇబ్బందులు పడటంతో మిగిలిన పాతిక వేలు వదులుకున్నానని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చాడు.
Also Read: ఏపీలో భీమ్లానాయక్ షో వేయలేక థియేటర్ల మూసివేత.. అసలు కారణాలు ఇవే