Samantha Emotional Post: హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ రాసిన విల్ పుస్తకం మంచి ఆదరణ పొందుతోంది. ఈక్రమంలో సమంతకు కూడా ఈ పుస్తకం బాగా నచ్చేసిందట. ధైర్యం కోల్పోకుండా కష్టపడి పని చేసి, జీవితానికి కాస్త హాస్యాన్ని జోడించండి అంటూ ఆ పుస్తకం గురించి పోస్ట్ పెట్టింది. అంతేకాదు అమెరికన్ రచయిత మార్క్ మాన్‌సన్ చేసిన పోస్ట్‌ని రీట్వీట్ చేస్తూ, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా జీవితాన్ని తిరిగి ప్రారంభించాలని సందేశాన్నిచ్చింది.
అలాగే సామ్ తన సినీ కెరీర్ తాను సినిమాల్లోకి వచ్చి నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని హీరోయిన్ సమంత గుర్తుచేసుకుంది. ‘లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ 12 అద్భుత సంవత్సరాలు అవుతోంది. ఇవన్నీ మరపురాని క్షణాలు. ప్రపంచంలోనే అత్యుత్తమ, నమ్మకమైన అభిమానులు ఉన్నందుకు గర్వపడుతున్నా’ అని పేర్కొంది.
Also Read: ‘పునీత్ రాజ్ కుమార్’ చివరి చిత్రం పై భారీ అంచనాలు
ఏ మాయ చేశావేతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సామ్.. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో, అత్తారింటికి దారేది, మనం, రంగస్థలం లాంటి ఎన్నో సినిమాలు చేసింది. సమంతగా కాస్త కొత్తగా ఆలోచించి మొత్తానికి ఈ కొత్త మెసేజ్ ను పోస్ట్ చేసింది. ఏది ఏమైనా 2021 సంవత్సరం సమంతకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం.
నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది. ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయింది.
ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయింది. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా. కాబట్టి వదిలేసింది. ఈ 2022లో ఎంతో బలంగా, ఎంతో తెలివిగా, అలాగే దయగల వ్యక్తిగా ఉంటానని, తనతోపాటే అందరూ అలాంటి లక్షణాలు అలవరచుకోవాలని మెసేజ్ చేసింది.
Also Read: ఇండస్ట్రీలో జగన్ ను ఎదురించి నిలిచిన ఏకైక మొనగాడు పవన్ కళ్యాణ్ యేనా?