https://oktelugu.com/

LIC Policy: LIC పాలసీ కట్టేవారికి శుభవార్త.. డబ్బును ఇలా తీసుకోవచ్చు..

పెద్దవాళ్లు పాలసీ తీసుకొని పూర్తి ప్రీమియం చెల్లించాక మెచ్యూరిటీ అమౌంట్ తీసుకొని వారు రూ.21,500 కోట్ల డబ్బు మూలుగుతున్నట్లు ఎల్ఐసీ ఇటీవల ప్రకటించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 9, 2023 3:50 pm
    LIC-Policy
    Follow us on

    LIC Policy: జీవితానికి ఆర్థికపరమైన సెక్యూర్ ఇవ్వడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పాలసినీ చాలా మంది తీసుకున్నారు. ఒకప్పుడు ఎల్ఐసీ తప్ప మరో సంస్థ లేదు. దీంతో ఇందులో కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. ఒకప్పుడు పాలసీ తీసుకున్నవారు ప్రీమియం చెల్లించి.. గడువు తీరిన తరువాత మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోక చనిపోయిన వారున్నారు. వారి వారసులకు తెలియక అ డబ్బు అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీ వారు వెబ్ సైట్ లో వివిధ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతోంది. ఇలా క్లెయిచ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.

    పెద్దవాళ్లు పాలసీ తీసుకొని పూర్తి ప్రీమియం చెల్లించాక మెచ్యూరిటీ అమౌంట్ తీసుకొని వారు రూ.21,500 కోట్ల డబ్బు మూలుగుతున్నట్లు ఎల్ఐసీ ఇటీవల ప్రకటించింది. దీంతో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకొని వదిలేసిన వారి వారసులు క్లెయిమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ముందుగా పూర్వీకుల పేరిట ఎల్ ఐసీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. ఆ తరువాత ఆ డిటేయిల్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఇస్తే వారు క్లెయిమ్ చేస్తారు.

    ముందుగా www.licindia.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఎల్ఐసీ ఎన్ క్లెయిమ్డ్ అనే కాలంలోకి వెళ్లాలి. ఇందులో అన్ క్లెయిమ్డ్ అనే దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓ బాక్స్ వస్తుంది. ఇందులో క్లెయిమ్ చేసుకొని మెచ్యూరిపటీ పొందని వారి డిటేయిల్స్ ఇవ్వాలి. వారి పేరు మీద ఎంత అమౌంట్ ఉందనేది అక్కడ డిస్ ప్లే అవుతుంది. ఈ వివరాలను తీసుకొని ఎల్ ఐసీ కార్యాలయంలో ఇవ్వాలి. దీంతో వారు క్లెయిమ్ చేస్తారు.