Thaman: తమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలకు ఆల్మోస్ట్ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. మరి కొత్త సినిమాలన్నింటికి తానే మ్యూజిక్ అందిస్తున్నారంటే మరెవరు లేక అనుకుంటున్నారా? అసలు కాదు.. తమన్ అందించే మ్యూజిక్ అలా ఉంటుంది. అయితే రీసెంట్ గా ఈయన పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు. అయితే నాన్నను తల్చుకొని బాధ పడ్డారు తమన్. ఎందుకు ఏంటి అనే విషయాలు మీకోసం..
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయాడు తమన్. స్టార్ హీరోలు, పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అలాంటి తమన్ చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డాడో కొందరికి మాత్రమే తెలుసు. గతంలో ఈ విషయం గురించి ఓ ఇంటర్య్వూలో తెలిపింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాల్యం గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ ఎమోషనల్ అయింది. తమన్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడని.. అప్పటి నుంచీ మ్యూజిక్ నేర్చుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడని.. చిన్నప్పటి నుంచే పెద్ద బాధ్యతను తీసుకున్నాడని పేర్కొంది.
తమన్‌కి చిన్నతనం నుంచి కూడా సంగీతం అంటే మహా ఇష్టమని, అది గమనించే కీబోర్డ్ ప్లేయర్‌గా జాయిన్ చేయించామని, తాను కూడా ఈజీగా నేర్చుకున్నాడని, ఆ తరువాత అదే జీవనోపాధిగా మారిందని తమన్ తల్లి సావిత్రమ్మ చెప్పుకొచ్చింది. అయితే తండ్రి లేని కష్టాలు తమన్ ఎన్నో అనుభవించాడని, చిన్న వయసులోనే బాధ్యతలను మోశాడంటూ సావిత్రమ్మ చెబుతూ ఎమోషనల్ అయింది. అలా తమన్ తల్లి తండ్రి గురించి మాట్లాడితే ఇప్పుడు ఏకంగా తమన్ తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు.
తమన్ తన తండ్రిని కోల్పోయి 28ఏళ్లు అవుతోందట. దీంతో మిస్ యూ నాన్నా అంటూ ట్వీట్ వేశాడు. మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయి 28 ఏళ్లు అవుతోంది.. మీరు మా చుట్టూనే ఉన్నారు.. మీరే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు.. లవ్యూ నాన్నా అంటూ తన తండ్రికి సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఇక ఏఐ జనరేటెడ్ ఫోటోతో ఇలా తన తండ్రిని చూసుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడంటూ తమన్ ట్వీట్ కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు
తమన్ ప్రస్తుతం భగవంత్ కేసరి రీ రికార్డింగ్ పనిలో ఉన్నాడు. మహేష్ బాబు గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ను రెడీ చేశాడు. అంతేకాదు గేమ్ చేంజర్ పాట లీక్ అవ్వడంతో అందులో తమన్ ట్యూన్, లిరిక్స్ మీద దారుణమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక రామ్ బోయపాటి స్కందకు తమన్ ఆర్ఆర్ మీద కూడా కంప్లైంట్లు వచ్చాయన్న విషయం విదితమే. మరి ఈ విషయాలపై అధికారికంగా ఎవరు స్పందించలేదు. చూడాలి వీటిపై ఎవరైనా స్పందిస్తారేమో..
ఏది ఏమైనా తమన్ మ్యూజిక్ కోసం ఎదురుచూసే వారికి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎన్నో సినిమాలు తమన్ మ్యూజిక్ తోనే రాబోతున్నాయి కాబట్టి వారందరికి మరోసారి తమన్ కొత్త మ్యూజిక్ వినే అవకాశం దొరికింది. మీకు కూడా ఇష్టం ఉంటే టెన్షన్ ఎందుకు సినిమాలు రిలీజ్ అయ్యాక చూసేయండి…