SSY Scheme: భారత ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే బాలిక సుకన్య యోజన పథకం ప్రవేశపెట్టింది. దీంతో ఆడపిల్లల స్కూల్ ఫీజులు, పెళ్లికి డబ్బులు కూడబెబెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనగా పిలువబడే ఈ పథకంలో చేరితే ఆడపిల్లల బతుకుకు భరోసా ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయడానికే ప్రభుత్వం ఈ స్కీం అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రతి మూడు నెలలకోసారి వడ్డీరేట్లను సవరిస్తుంది. జులై సెప్టెంబర్ త్రైమాసికంలో 8 శాతం వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. అంతకు ముందు ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో 40 బేసిస్ పాయింట్ల పెంచి 8 శాతం పెంచింది. ఇలా వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మనం పొదుపు చేసే మొత్తానికి వడ్డీ చెల్లిస్తుంది. అందుకే ఎస్ ఎస్ వై పథకంలో చేరి ఆడపిల్లల తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీసు లేదా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో సైతం ప్రారంభించుకోవచ్చు. బర్త్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ ఉంచుకుని దరఖాస్తు నింపితే సరిపోతుంది. అన్ని కరెక్టుగా ఉంటే ఖాతా తెరుచుకోవచ్చు. ఏడాదికి కనీసం రూ.250 నుంచి రూ. 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఆడపిల్ల పేరు మీదే ఖాతా తీసుకోవాలి.
ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి తెరవొచ్చు. పాపకు పదేళ్లు వచ్చే లోపు ఖాతా తెరిచేందుకు అర్హులు. పాపకు 15 ఏళ్ల పాటు డబ్బులు కడుతూ ఉండాలి. మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు. పాపకు 18 ఏళ్లు వస్తే డబ్బులు 50 శాతం డ్రా చేసుకోవచ్చు. కనీసం ఏడాదికి రూ. 250 అయినా లేదా నెలకు రూ.2 వేలు అయినా కట్టుకోవచ్చు. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రూ. లక్షల్లో వస్తాయి. దీంతో బాలికలకు ఈ పథకం వరంగా మారనుంది.