https://oktelugu.com/

Allu Arha Remuneration: నిమిషానికి 2 లక్షలు..చిన్నతనం లోనే తండ్రిని మించి పోయినా అల్లు అర్హ

ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం 5 వ షెడ్యూల్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్యనే ఎక్కువ గా సన్నివేశాలను చిత్రీకరించారు. జాన్వీ కపూర్ కూడా కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఒకటి నేడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.

Written By:
  • Vicky
  • , Updated On : July 15, 2023 / 05:20 PM IST

    Allu Arha Remuneration

    Follow us on

    Allu Arha Remuneration: #RRR లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కి పాన్ వరల్డ్ రేంజ్ లో మంచి క్రేజ్ దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

    ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం 5 వ షెడ్యూల్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్యనే ఎక్కువ గా సన్నివేశాలను చిత్రీకరించారు. జాన్వీ కపూర్ కూడా కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఒకటి నేడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.

    అదేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ని అడిగారట. స్వయంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి ఫోన్ చేసి ఇలా చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్హ ని తీసుకుందామని కొరటాల శివ అంటున్నాడు, మరి నీకు ఓకే నా?, అని అడగగా అల్లు అర్జున్ క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాడట. వచ్చే నెలలో అల్లు అర్హ పాత్ర కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేయబోతున్నారట. ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాల వరకు ఉంటుంది.

    ఈ 10 నిమిషాలకు గాను ఆమెకి 20 లక్షల రూపాయిల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. అంటే ఒక్కో నిమిషానికి రెండు లక్షల రూపాయిలు అన్నమాట. ఇప్పటికే ఈ చిన్నారి సమంత ప్రధాన పాత్ర లో నటించిన ‘శాకుంతలం’ చిత్రం లో భరతుడిగా నటించింది. క్యూట్ డైలాగ్స్ తో అచ్చ తెలుగు ఎలాంటి తప్పు లేకుండా మాట్లాడడం అందరికీ తెగ నచ్చేసింది. మరి ఈ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.