https://oktelugu.com/

Ants: చీమలు ఉన్నాయా? ఇలా దూరం చేయండి..

మల్ని బయటికి పంపేందుకు కెమికల్స్ ప్రోడక్ట్స్‌ని వాడతారు. కానీ, చిన్నపిల్లలు ఉంటే వాటి వల్ల ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కెమికల్ ఫ్రీ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 16, 2024 / 05:46 PM IST

    How to Get Rid of Ants Permanently in the House

    Follow us on

    Ants: చీమలను చూస్తే బలే అనిపిస్తుంటుంది కదా. ఏంటి చీమలను చూస్తే బాగుంటుందా ఇదేంటి అనుకుంటున్నారా? అదేనండి వాటి క్రమశిక్షణ. ఒక చీమ ఇంట్లోకి వచ్చిందంటే లైన్ గా క్యూ పద్దతిలో అన్నీ వస్తుంటాయి. కిచెన్, వంటలు, వంట పదార్థాల దగ్గర మకాం వేస్తాయి. ఎంత క్రమశిక్షణగా ఉన్నా కూడా ఇంట్లో ఉంటే మనుషులకు ఇబ్బందే కదా. అందుకే చీమల్ని బయటికి పంపేందుకు కెమికల్స్ ప్రోడక్ట్స్‌ని వాడతారు. కానీ, చిన్నపిల్లలు ఉంటే వాటి వల్ల ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కెమికల్ ఫ్రీ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి.

    సిట్రస్ ఆధారిత పండ్లు చీమల్ని దూరం చేస్తాయి. సిట్రస్ ఉంటే పండ్లు ఏవంటే.. నారింజ, నిమ్మ, ఆరెంజ్ వంటి పండ్ల తొక్కల్ని సన్నగా తరిగి వాటిని చీమలు సంచరించే ప్రదేశాల్లో ఉంచండం వల్ల ఫలితం ఉంటుంది. వీటి వల్ల చీమలు దూరమవుతాయి. చీమల్ని దూరం చేయడంలో సిట్రస్ ఫ్రూట్స్ పీల్ లిక్విడ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందుకోసం తొక్కల్ని సన్నగా ముక్కలుగా చేసి పావు కప్పు గోరువెచ్చని నీరు వేసి బ్లెండ్ చేయండి. దీనిని వడపోసి చీమల ప్రాంతంలో స్ప్రే చేయండి.

    కారం వంటి పదార్థాలకి చీమలని దూరం చేసే గుణం ఉంది. కాబట్టి, చీమలు తిరిగే ప్రాంతంలో నల్ల మిరియాలు, ఎర్ర మిరపకాలయను పెట్టాలి. వీటి వల్ల చీమలు దూరమవుతాయి. వేపనూనె కూడా చీమల్ని దూరం చేస్తాయి. ఇందుకోసం ఏదైనా కొద్దిగా కాస్టైల్ సబ్బు, వేపనూనె, నీరు, స్ప్రే బాటిల్ ను యూజ్ చేయాలి. ముందుగా స్ప్రే బాటిల్‌లో 1 1/4 కప్పుల నీరు పోసి, అందులో కాస్టైల్ సబ్బు పోయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వేప నూనె వేయాలి. బాటిల్‌ని మూసి వీటన్నింటిని షేక్ చేయాలి. ఆ తర్వాత రెడీ అయిన మిశ్రమాన్ని చీమలు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయండి.

    కాఫీ గ్రౌండ్స్ చీమల్ని దూరం చేస్తాయి. కాఫీ వాసన అంటే చీమలకి పడవు. కాబట్టి, చీమలు తిరిగే ప్రాంతంలో కాఫీ పౌడర్‌ని చల్లండి. దీంతో చీమలు దూరమవుతాయి.
    వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చీమల్ని దూరం చేస్తాయి. అందుకోసం వెనిగర్‌ని చీమలు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయండి. అదే విధంగా, ఆ ప్రాంతంలో స్ప్రే చేసి తుడవండి. దీంతో చీమలు తగ్గుతాయి.

    బేకింగ్ సోడా చీమల్ని దూరం చేస్తాయి. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి, హ్యాపీగా వాడొచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాలో చక్కెర అంతే పరిమాణంలో కలపండి. ఈ మిశ్రమాన్ని చీమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేయడం వల్ల చీమల బెడద నుంచి దూరం అవచ్చు.