Sunny Leone : సన్నీలియోన్ పై ఈ యువకులకు ఎంత ప్రేమో కదా..?

ఇక అలాగే సన్నీలియోన్ ఇండియాలోనే ఉంటూ ఇక్కడి ప్రజలతోనే మమేకమైపోయి, ఇక్కడ ప్రజలకు సేవ చేయడం అనేది కూడా ఆమెలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ గా మనం చెప్పుకోవచ్చు అంటూ ఆ బాయ్స్ ఆమె గురించి చాలా గొప్పగా చెప్పారు...

Written By: NARESH, Updated On : May 16, 2024 5:52 pm

Karnataka youth celebrated Sunny Leone's birthday

Follow us on

Sunny Leone :  సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే అభిమాన సంఘాలు ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళ అభిమాన హీరో హీరోయిన్ల సినిమాలా రిలీజ్ అప్పుడు గాని, జీవితంలో ఏదైనా ఆనందదాయకమైన విషయం జరిగినప్పుడు గానీ లేదా వాళ్ళ పుట్టినరోజు సందర్భాల్లో గాని అభిమానులు భారీ ఎత్తున హంగామా చేస్తూ, కేకులు కట్ చేస్తూ, భారీ కటౌట్లను కూడా కడుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సన్నీలియోన్…రీసెంట్ గా మే 13వ తేదీన ఆమె 43వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇక అందులో భాగంగానే కొంతమంది యూత్ అభిమానులు ఆమె కి సంబంధించిన పెద్ద పెద్ద కటౌట్లను కట్టి ఒక పెద్ద కేకును కూడా కట్ చేసి ఆమె మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక ఇది చూసిన కొంతమందికి సన్నీలియోన్ కి అభిమానులు ఉండటం ఏంటి అనే డౌట్ అయితే రావచ్చు. కానీ తనకి కూడా చాలామంది అభిమానులు ఉన్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని ‘ కర్కల్లి ‘ గ్రామానికి చెందిన కొంతమంది యూత్ మే 13న సన్నీలియోన్ బర్త్ డే రోజు కేక్ కట్ చేసి వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇక వీళ్ళని ‘కర్కల్లి బాయ్స్’ అని కూడా పిలుస్తారట… ఇక సోషల్ మీడియాలో లేటుగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక సన్నీ లియోన్ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్న బాయ్స్ కూడా స్పందిస్తూ సన్నీలియోన్ కి వాళ్ళు బర్త్ డే విషెస్ చెబుతూ కేక్ కట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటీ అనే దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చారు…

సన్నీలియోన్ హీరోయిన్ గా రాణించిన రాణించక పోయినా కూడా ఆమెలో సామాజిక సేవ చేయాలనే ఒక సేవా గుణం అయితే దాగి ఉంది. దాని ద్వారా ఆమె చాలామంది పేదలను ఆదుకున్నారు. ఇక ముఖ్యంగా కరోనా సమయంలో అయితే చాలామంది తిండి లేని వారికి కూడా ఆమె తిండి పెట్టి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ని ఇచ్చింది. అందువల్లే సన్నిలియోన్ అంటే నాకు అమితమైన గౌరవం ఏర్పడింది. ఇక దాని వల్లే సన్నిలియోన్ ప్రతి పుట్టినరోజు నాడు మేమిలా కేక్ కట్ చేస్తూ ఉంటాం అంటూ ఆ బాయ్స్ వాళ్ల సమాధానాన్ని తెలియజేశారు.

ఇక అలాగే సన్నీలియోన్ ఇండియాలోనే ఉంటూ ఇక్కడి ప్రజలతోనే మమేకమైపోయి, ఇక్కడ ప్రజలకు సేవ చేయడం అనేది కూడా ఆమెలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ గా మనం చెప్పుకోవచ్చు అంటూ ఆ బాయ్స్ ఆమె గురించి చాలా గొప్పగా చెప్పారు…