Hair: జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా అనిపిస్తుంది. ఇక ఈ మధ్య జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. దీనిని తగ్గించుకునేందుకు చాలా కెమికల్ కలర్స్ వాడుతుంటారు. దీని వల్ల జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా చాలా సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యని సాల్వ్ చేయడానికి ఖరీదైన షాంపులు, కండీషనర్ లు మాత్రమే కాదు ఇంట్లో ఉండే పదార్థాలు చాలు అంటారు నిపుణులు. దీని వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదు. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటి వాటితో ఏం చేయాలో తెలుసుకోండి.
నల్ల జీలకర్ర జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాదు జుట్టు కూడా పెరుగుతుంది. కాబట్టి, దీనిని రెగ్యులర్‌గా వాడడం మంచిది. జుట్టుకి ఉసిరి కూడా అమృతమని చెప్పొచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్ కూడా ఉంటుంది. దీనిని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి పెరుగుతుంది. జుట్టుని బలంగా తయారుచేసేందుకు ఉసిరి హెల్ప్ చేస్తుంది.
వాము ఆకు కూడా జుట్టుని నల్లగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది. దీనిని మిక్సీ పట్టుకుని పేస్టులా చేయాలి. అయితే దీనిని రెండు దశల్లో చేయాలి. ముందురోజు ఇనుప కడాయి తీసుకుని వాము ఆకు పేస్టు, ఉసిరి పొడి, నల్ల జీలకర్ర పొడి వేసి బాగా కలపుకోవాలి. దానిని ఓ రాత్రంతా అలానే ఉంచి.. వీలైతే 24 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేసిన పేస్టును తలకి అప్లై చేసుకొని.. 2 గంటల తర్వాత జుట్టుని నీటితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
మరుసటి రోజు ఇండికా పొడిలో కొద్దిగా గోరువెచ్చని నీరు పోసి పేస్టులా చేసుకోవాలి. దీనిని జుట్టుకి అప్లై చేసి గంట తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత షాంపు లేకుండా నార్మల్ వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలి.