Colour Voter ID Card: దేశంలోని ప్రజలకు ఉండే గుర్తింపు కార్డులలో ఓటర్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఓటర్ కార్డును కలిగి ఉండటం వల్ల ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓటర్ కార్డు అవసరమైన వాళ్లు ఇంటినుంచే ఓటర్ కార్డును పొందే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. స్మార్ట్ ఫోన్ ద్వారా అప్లికేషన్ ను ఇచ్చి సులభంగా కలర్ ఓటర్ కార్డ్ ను పొందవచ్చు.
erకలర్ ఓటర్ కార్డ్ కావాలని అనుకునే వాళ్లు మొదట నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ కు వెళ్లాలి. ఆ వెబ్ సైట్ లోని హోమ్ పేజ్ లో పోర్టల్ బాక్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పోర్టల్ లో మన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన సమాచారంను ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫారం 6ను నింపడం ద్వారా మనం సులభంగా కొత్త ఓటర్ కార్డును పొందే అవకాశం అయితే ఉంది.
Also Read: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్
కొత్త ఓటర్ కార్డ్ కొరకు దేశంలోని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడాల్లెకుండా ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ సమాచారాన్ని ధృవీకరించి సబ్మిట్ చేసిన పత్రాలను ధృవీకరించడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త కలర్ ప్లాస్టిక్ ఓటర్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ సహాయంతో కొత్త ఓటర్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటినుంచే కలర్ ఓటర్ కార్డును పొందాలని భావించే వాళ్లకు ఈ నిబంధనల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కలర్ ఓటర్ ఐడీ కార్డ్ పొందాలని అనుకునే వాళ్లు కొత్త కార్డు కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్