Telangana: తెలంగాణ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రచ్చకెక్కుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కీలక ఆత్ర పోషించినా తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్సే. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైపనోయింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ లొల్లి బజారుకెక్కింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విషయంలో బీజేపీకి ప్రేమ లేదన చెబుతూ బీజేపీని నిందించాలని చూస్తున్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు నిర్ణయించుకుంది. దీంతో కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య తెలంగాణ అంశం ప్రధాన ఎజెండాగా మారుతోంది.
తెలంగాణ ఇచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్ తో నష్టాలు వస్తాయని తెలిసినా కాంగ్రెస్అధినేత్రి సోనియా గాంధీ లెక్కచేయకుండా త్యాగం చేసినా దాని ఫలాలు రాబట్టుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. ఫలితంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ బలపడింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా లాభం మాత్రం పొందింది టీఆర్ఎస్. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది. అయినా కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగడం లేదు. ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడంలో విఫలమవుతోంది.
తెలంగాణ విషయంలో ప్రధాని తన ప్రసంగంలో విభజన సరిగా చేయలేదని విమర్శలు చేయడంతో టీఆర్ఎస్ దాన్ని రాద్దాంతం చేసి మరీ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ప్రయత్నిస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఏ రకమైన ప్రయోజనం పొందలేకపోతోంది. తెలంగాణ తెచ్చినా ఇచ్చినా తామేనని ఎక్కడ కూడా చెప్పుకోలేకపోయింది. ఫలితంగా అప్రదిష్టను మూటగట్టుకుని అవమానాలు పొందుతోంది.
తెలంగాణ ఏర్పాటులో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ బీజేపీనే టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో బీజేపీని ఎదగనీయకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీని అన్ని దారుల్లో అడ్డుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ను పూర్తిగా ప్రజలు మరిచిపోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తరువాత కూడా ఆ పార్టీ ముందుకెళ్లలేకపోతోంది.
Also Read: చినజీయర్ స్వామిపై కేసీఆర్ కోపానికి అసలు కారణం అదేనా?
దీనిపై టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుర్కొనేందుకు అన్ని మార్గాల్లో ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే మూడో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. దీనికి గాను బీజేపీ యేతర పక్షాలతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో స్టాలిన్, విజయన్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ లాంటి నేతలతో ఇప్పటికే సమావేశం అయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను కూడా తమ జట్టులో కలుపుకోవాలని చూస్తున్నారు.
తెలంగాణ అంశాన్ని తీసుకుని రెండు పార్టీలు వివాదాలు రాజేస్తున్నాయి. తమ ప్రభావం చూపించుకోవాలని తాపత్రయపడుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నాయి. కేసీఆర్ ప్రధాని మోడీపై ప్రత్యక్ష పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ బీజేపీ ఎండగట్టాలని చూస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియడం లేదు
Also Read: కాంగ్రెస్ తో కేసీఆర్? కొత్త పార్టీ దిశగా రేవంత్ రెడ్డి?