Power of One Sperm: ఇప్పుడున్న వారిలో చాలా మంది ఏదో రకంగా ఇంటర్నెట్ వాడుతున్నవారే. ఒకప్పుడు ఒక MB ఫైల్ డౌన్ లోడ్ కావాలంటే ఎంతో సమయం పట్టేది. కానీ ఇప్పుడు 1 GB ఫైల్ కూడా క్షణాల్లో డౌన్ లోడ్ అవుతుంది. అయితే ఈ 1 జీబీ ఫైల్ లో ఎంతో సమాచారం ఉంటుంది. అంటే ఈ సైజ్ లో ఒక మూవీని కూడా చూడొచ్చు. మరి 38 జీబీ లో ఎంత డేటా ఉంటుంది? దాదాపు 38 సినిమాలో చూడొచ్చు. ఈ 38 జీబీ గురించి ఎందుకు చర్చ అంటే.. ఒక శుక్ర కణంలో 38 జీబీ డేటా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక శుక్రకణంలోనే ఇంత డేటా ఉంటే.. మరి కోట్ల శుక్రకణాల్లో ఎంత జీబీ ఉంటుంది? ఈ జీబీతో ఎటువంటి ఉపయోగం? ఆ వివరాల్లోకి వెళితే..
Also Read: కొవిడ్ తర్వాత మారిన ప్రజల అభిరుచి.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
ఇటీవలి కాలంలో కొందరు సైంటిస్టులు శుక్రకణాలు ఎటువంటి సమాచారాన్ని చేరవేస్తాయి? వీటితో సమాచారాన్ని సేకరించడానికి ఎంత డేటా ఉంటుంది? అనే విషయంపై అధ్యయనం చేశారు. ఒక శరీరంలో అన్ని అవయవాలకు సమాచారం అందించడానికి శుక్రకణాలు చాలా వరకు ఉపయోగపడుతాయని చెబుతున్నారు. మనం రోజూ ఉపయోగించే ఇంటర్నెట్ లో 1 జీబీ వాడితే ఎంత సమాచారం అందుతుందో.. అంతకు రెట్టింపు స్థాయిలో శుక్రకణాలు సమాచారాన్ని సేకరిస్తాయి.
ఒక శుక్రకణంలో 38 జీబీ వరకు డేటా ఉంటుందని కనుగొన్నారు. ఇందులో 750 ఎంబీ వరకు శరీరంలోని కళ్లు, జుట్టు రంగు, ఎంతు వంటి వాటి నిర్మాణానికి ఉపయోగపడుతుంది. మిగిలిన డేటాతో DNA ఎలా పనిచేయాలో సూచిస్తుందట. ఒక్క శుక్రకణంలో 38 జీబీ ఉంటే.. కొన్ని కోట్ల శుక్రకణాల్లో ఎంత డేటా ఉంటుంది? అనేదానిని కొనుగొన్నారు. ఒకసారి స్థలనం అయినప్పుడు దాదాపు 20 నుంచి 50 కోట్ల వరకు శుక్రకణాలు రిలీజ్ అవుతుంది. ఒక్కో శుక్రకణంలో 38 జీబీని లెక్కిస్తే 19వేట టీబీ వరకు ఓ స్థలనంలో సమాచారం ఉంటుందన్న మాట.
Also Read: దేవుడి దగ్గరకు వెళుతానన్నది.. ఈ మహిళ చేసిన పని వైరల్
అంటే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పరిణామం సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంప్యూటర్ సాప్ట్ వేర్ లో ఈ పరిమాణం కంటే తక్కువగా ఉండి.. కంప్యూటర్ పనిచేస్తుంది. ఇంతకంటే ఎక్కువగా ఇక్కడ సమాచారం ఉండడంతే మానవ శరీర నిర్మాణానికి శుక్రకణాల్లో ఉండే డేటా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి శుక్రకణాలు వెళ్లడం ద్వారా ఎంతో విలువైన డేటాను తీసుకెళ్తుంది. అంటే ఒక వ్యక్తిలోని లక్షణాలను మరో వ్యక్తిలోకి ఇవి వెళ్తాయి. ఇలా ఇద్దరి కలయిక వల్ల కొత్త వ్యక్తికి కొత్త లక్షణాలు ఉంటాయి.