Phone Call Disconnect Reason: దూర ప్రాంతాల్లోని వారితో మాట్లాడడానికి మొబైల్ ప్రధాన వాహకంగా నిలుస్తుంది. ఒకప్పుడు 2G నెట్వర్క్ తోనే కొనసాగేది. కానీ ఆ తర్వాత అభివృద్ధి చెందుతూ వస్తూ ప్రస్తుతం 5G నెట్వర్క్ నడుస్తోంది. త్వరలో 6G నెట్వర్క్ కూడా రాబోతుంది. అయితే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా… కాలింగ్ లో సమస్యలు ఎదురవుతున్నాయి. మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అవ్వడం.. కాల్స్ జంప్ కావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి? దీనితో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి?
Also Read: కొవిడ్ తర్వాత మారిన ప్రజల అభిరుచి.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
గతంలో కంటే ఇప్పుడు మొబైల్ యూజ్ చేసేవారు చాలామంది పెరిగిపోయారు. ఒకప్పుడు కేవలం కొంతమంది వద్ద మాత్రమే మొబైల్ ఉండేది. అదికూడా కీ ప్యాడ్ తో కలిగిన ఫోన్ ఉండి.. దీని నీ కేవలం మాట్లాడుకోవడానికి కోసం మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు ఉన్న స్మార్ట్ మొబైల్ తో అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా వీడియోలు చూడడం.. ఫైల్స్ పంపించుకోవడం.. మెసేజ్ చేయడం.. అలాగే కొన్ని రకాల పనులు కూడా దీనితోనే చేయడంతో నెట్వర్క్ బిజీగా మారిపోతుంది. ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలను ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. ఫలితంగా నెట్వర్క్ ఒక్కోసారి అన్ని ప్రాంతాల్లో సరిగా ఉండడం లేదు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి.
ఇటీవల కొంతమంది చెబుతున్న ప్రకారం వారు మాట్లాడుతుండగానే మొబైల్ కట్ అవుతుంది. అలాగే ఫోన్ లిఫ్ట్ అయిన తర్వాత ఎలాంటి వాయిస్ వినిపించకపోవడం.. ఒక్కోసారి కాల్స్ జంపు కావడం.. ఎవరో ఫోన్ చేస్తే మరొకరు మాట్లాడడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఇలాంటి వాటికి అనేక కారణాలు ఉన్నాయి. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉండడంతో పాటు అసలు సిగ్నల్ లేకపోవడం వల్ల ఒక్కోసారి ఫోన్ వచ్చిన లిఫ్ట్ చేసిన తర్వాత వాయిస్ వినిపించే అవకాశం ఉండదు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న రూటర్ లేదా మోడెమ్ లాంటి పరికరాలలో సమస్యలు ఉండడం వల్ల కూడా ఇంటర్నెట్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. చాలావరకు ఇంటర్నెట్ ఆన్ లో ఉండగానే మొబైల్ మాట్లాడే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి సమయంలో నెట్వర్క్ లో సమస్యలు.. కాలింగ్ పై ప్రభావం పడుతుంది. దీంతో కమ్యూనికేషన్ లోపం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా సాఫ్ట్వేర్ లో ఉన్న సమస్యలు లేక నెట్వర్క్ డ్రైవర్లు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
Also Read: వర్షాకాలంలో టూర్ ఎక్కడికి బెటర్..చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!
అయితే ఏ ఆపరేటర్ నుంచి ఇలాంటి సమస్య ఉందో వారికి సంబంధిత ఇష్యూ గురించి ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి నెట్వర్క్ సమస్య కాకపోయినా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కొందరు సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఫోన్లు చేసి ఎదుటివారి నుంచి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల పదే పదే ఈ సమస్య వస్తే వెంటనే ఆయా నెట్వర్క్ కార్యాలయాలకు వెళ్లి దీని గురించి వివరించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది.