Spiritual Self-sacrifice: ఈరోజుల్లో ఆ*త్మహత్య చేసుకోవడానికి పెద్దగా కారణాలు ఉండడం లేదని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడి మానసిక ఆందోళనలతో చాలామంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారని చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ తాను దేవుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఆ*త్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది.. కొన్ని రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న ఆమె హైదరాబాదులోని నారాయణగూడలో 5 అంతస్తు భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అయితే ఆమె ఇలా మారడానికి కారణాలు ఏంటి అని దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాదులోని నారాయణగూడ పరిధిలో ఉన్న హిమాయత్ నగర్ ఉర్దూ హాల్ ఎదురుగా ఓ ఐదంతస్తుల భవనం ఉంది. ఇందులో వ్యాపారి అరుణ్ కుమార్ జైన్, అతని భార్య పూజ జైన్ కలిసి ఉంటున్నారు. అయితే పూజా జెన్ గత ఐదేళ్లుగా ఆధ్యాత్మిక వైపు ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందే మానసిక సమస్యతో ఉన్న ఆమె కొన్ని రోజులపాటు ఇలా ఉండడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంది. అయితే భర్త వ్యాపార కార్యాలయానికి వెళ్లిన తర్వాత వారు నివసిస్తున్న 5 అంతస్తు భవనం పైకి ఎక్కి ఒక్కసారిగా దూకింది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానికంగా ఉన్న హైదర్ గూడ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. పూజ జైన్ ఐదో అంతస్తు పైనుంచి దూకే సమయంలో ఇంట్లో కొడుకు, కూతురు, పనిమనిషి ఉన్నారు. వారు ఈ సంఘటన జరిగిన తర్వాత షాక్ కు గురయ్యారు.
ఆ*త్మహత్య చేసుకునే ముందు పూజ జైన్ ఒక లెటర్ రాసి ఉంచారు. ఇందులో ఆ*త్మార్పణం చేసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం అని రాసి ఉంది.. దీనిని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై నాగరాజు తెలిపారు. ఇలా ఇటీవల కొంతమంది మానసిక సమస్యతో బాధపడుతూ అనవసరంగా ప్రాణాలు తీసుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు లేదా దగ్గర వారితో పంచుకోవాలని.. అప్పటికి పరిష్కారం కాకపోతే మానసిక నిపుణులు సంప్రదించాలని అంటున్నారు. ఒకవేళ తమ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ప్రవర్తిస్తే వారికి సరైన చికిత్స ఇప్పించాలని పేర్కొంటున్నారు.
కొంతమంది నేటి కాలంలో విద్యార్థులు సైతం మానసిక సమస్యలతో తీవ్రంగా మనోవేదన చెంది ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. మనోధైర్యం లేకపోవడంతోనే వాళ్ళు ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అయితే పిల్లల్లో ధైర్యం తెలిపేందుకు తల్లిదండ్రులు సహకరిస్తూ ఉండాలి. వారిని పదే పదే ఒత్తిడి చేయకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. ముఖ్యంగా వారు మౌనంగా ఉండడం లేదా.. బాధపడుతూ ఉంటే వారి గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి.