Rahul Sipligunj: ఓ వైపు విద్యాబుద్దులు నేర్చుకునేందుకు పాఠశాలకు వెళ్లడం.. మరో వైపు జేబు ఖర్చుల కోసం తండ్రితో కలిసి బార్బర్ షాపులో పనిచేయడం.. ఇంకో వైపు ఇంట్లో గిన్నెలపై కట్టెలతో కొట్టి సౌండ్ చేయడం.. ఇవన్నీ చూస్తున్న ఆ కుర్రాడి తండ్రికి ఓ ఆలోచన వచ్చింది. తన కుమారుడికి సంగీతం నేర్పించాలని అనుకొని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు పనిచేసి ఆ తరువాత కుర్రాడు యువకుడిలా మారి చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా మారాడు. ఇంకొన్నాళ్ల తరువాత స్టార్ సింగర్ గా మరి శ్రోతలను ఊర్రూతలూగించారు. ఇప్పుడు ప్రపంచ సినీ వేదిక ఆస్కార్ వేదికపైనే పాడేందుకు రెడీ అయ్యాడు. ఆయన ఎవరో కాదు రాహుల్ సిప్లిగంజ్..
రాహుల్ సిప్లిగంజ్ పేరు ఇప్పుడు సంగీతం గురించి తెలిసిన ప్రతినోటా వినిపిస్తోంది. మార్చి 12న ఆయన కాలభైరవతో కలిసి ‘నాటు నాటు ’సాంగ్ పాడనున్నాడు. ఇప్పటికే ఈ సాంగ్ వివిధ అంతర్జాతీయ అవార్డులను అందుకుుంది. అస్కార్ అవార్డుకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ కూడా అయింది. ఇప్పుడు ఆస్కార్ వేదికపై లైవ్ లో పాడేందుకు రాహుల్ సిప్లిగంజ్ అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్టు పెడుతున్నారు.
1989 ఆగస్టు 22న రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ పాతబస్తీలో జన్మించారు. రాహుల్ తన చిన్నతనంలో తండ్రితో కలిసి మంగళ్ హాట్ లోని బార్బర్ షాపులో పనిచేసేవాడట. ఇదే సమయంలో సంగీతంపై ఆసక్తి ఉండడంతో ఇంట్లో ఉన్న గిన్నెలపై కట్టెలతో సౌండ్ చేస్తుండేవారట. ఆయన ఆసక్తి చూసిన తండ్రి రాహుల్ 7వ తరగతి చదువుతున్న సమయంలో గజల్ సింగర్ పండిట్ విఠల్ దగ్గర జాయిన్ చేశాడట.
ఇక్కడ చేరిన రాహుల్ గజల్ పాటలపై పట్టు సాధించారు. అలా 7 సంవత్సరాల పాటు ఆయన దగ్గర పనిచేసి సినిమాల్లో కోరస్ పాడే అవకాశాలు దక్కించుకున్నారు. ఇదే సమయంలో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ఆ పాటల సీడీలన్నీ కీరవాణికి అందించారట. రాహుల్ ప్రతిభను చూసి ఆయనకు దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అన్న సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటతో రాహుల్ దశ తిరిగింది.
ఆ తరువాత రాహుల్ యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి పలు మ్యూజిక్ అల్బమ్ లు చేశారు. వీటిలో మంగమ్మ, మాకికిరికి, పూర్ బాయ్, దావత్, గల్లికా గణేశ్ పాపులారిటీ సాధించాయి. ఈ తరుణంలో రాహుల్ కు మరోసారి రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగ రంగ స్థలానా’ అనే సాంగ్ ను పాడేందుకు దేవీశ్రీ ప్రసాద్ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సాంగ్ లో ‘నాటు నాటు ’ సాంగ్ ను కాలభైరవతో కలిసి పాడారు.
‘నాటు నాటు’ ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాయి. ప్రత్యేకంగా కీరవాణి ఈ సాంగ్ కోసం స్పెషల్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇక అస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయింది. ఇప్పుడు నాటు నాటు సాంగ్ ను ఆస్కార్ వేదికపై లైవ్ ల పాడేందుకు సిద్ధమవుతున్నారు. అంటే రాహుల్ ఆస్కార్ వేదికపై పాడే అవకాశం దక్కించుకోవడంతో తెలుగువారంతా ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rahul sipligunj emotional journey how he rose from barber to oscar range
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com