https://oktelugu.com/

Chicken: ఆలసించినా ఆశా భంగం.. అక్కడ కిలో చికెన్ జస్ట్ ₹150 మాత్రమే.. త్వరపడండి..

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. శుభకార్యాల జోరు ఎక్కువైంది. సహజంగా ఈ కాలంలో మాంసాహారాన్ని తినడానికి జనాలు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. పైగా పెళ్లిళ్ల సమయంలో మాంసాహారం వడ్డించడం సర్వసాధారణం. అందువల్లే ఈ సమయంలో మటన్, చికెన్ రేట్లు ఎక్కువగా ఉంటాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 10, 2025 / 03:00 AM IST
    Chicken

    Chicken

    Follow us on

    Chicken: పెళ్లిళ్ల సమయంలో చికెన్ వినియోగం అధికంగా ఉంటుంది.. ఈ కాలంలో ఫామ్ లలో పెంచే కోళ్లు కూడా ఎక్కువగా చనిపోతుంటాయి. వినియోగం అధికంగా ఉండడం.. సప్లై తక్కువగా ఉండడంతో కోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందువల్లే ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు చికెన్ రేటు దాదాపు 230 నుంచి 250 వరకు పలుకుతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెళ్లిళ్ల హడావిడి మొదలైంది. వేడుకల జోరు పెరిగింది. ఈ సమయంలో మాంసాహారం వినియోగం అధికంగా ఉంటుంది కాబట్టి.. చికెన్ రేటు కూడా భారీగానే ఉంది. రిటైల్ లైవ్ అయితే కిలో చికెన్ 120 రూపాయలు పలుకుతోంది. అదే డ్రెస్స్ డ్ చికెన్ అయితే 240 నుంచి 250 వరకు లభిస్తోంది. ప్రాంతాలను బట్టి రేటు మారుతున్నది. ఇప్పుడు యాప్స్ ద్వారా కూడా చికెన్ విక్రయాలు సాగుతున్నాయి కాబట్టి.. ధర కూడా అందులో మామూలు మార్కెట్ లలో పోల్చి చూస్తే 20 నుంచి 30 రూపాయలు అధికంగానే ఉంటుంది. ఇక వచ్చే రోజుల్లో అయితే చికెన్ ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో వేడుకలు, పెళ్లిళ్లు మరింత జోరుగా సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో వైరస్ వల్ల కోళ్లు చనిపోతున్నాయి. దీంతో మార్కెట్ లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా చికెన్ సప్లై కావడం లేదు.. అందువల్లే ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి..

    ఇక్కడ మాత్రం 150 రూపాయలే

    దేశం మొత్తం మీద చికెన్ రేట్లు ఎక్కువగా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో మాత్రం అత్యంత చవకగా లభిస్తోంది. ఇక్కడ మార్కెట్ ధర కంటే 40 రూపాయలకు తక్కువకే చికెన్ ను వ్యాపారులు విక్రయిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఇదే తీరు కొనసాగుతోంది. వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో కిలో చికెన్ ధర 150 నుంచి 180 రూపాయల మధ్యనే లభిస్తోంది. దీంతో చుట్టుపక్కల వారు తమ ఇంట్లో ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు క్వింటాళ్లకొద్దీ చికెన్ ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీ ఫామ్ లు ఉన్నాయి. అందువల్లే వారు తక్కువ రేటుకు చికెన్ అమ్ముతున్నారు. కేవలం కామారెడ్డి మాత్రమే కాదు, నిజామాబాద్, బాల్కొండ, ఆర్మూర్, డీచ్ పల్లి ప్రాంతాల వారు కూడా కామారెడ్డికి వెళ్లి చికెన్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే ఇక్కడ చికెన్ కొని.. ఇతర ప్రాంతాలలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ వ్యాపారులు తమ పోటీ తత్వాన్ని తగ్గించుకోలేదు. ఫలితంగా ఇక్కడ వినియోగదారులకు కిలో చికెన్ 150 నుంచి 180 రూపాయల మధ్యనే లభ్యమవుతోంది. వ్యాపారుల మధ్య పోటీ వల్ల తమకు తక్కువ ధరకు చికెన్ లభిస్తుందని వినియోగదారులు సంబరంగా చెబుతున్నారు.