Housewarming Ceremony : ఇల్లు కట్టుకోవడం చాలామంది కి ఒక కల. ఈ కలలు నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ఈ శ్రమలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అయినా ముందుకు వెళ్లి తమ లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు. అయితే ఇల్లు పూర్తి అయిన తర్వాత గృహప్రవేశ విషయంలో కొందరు కొన్ని పొరపాటు చేస్తుంటారు. జీవితంలో ఇల్లు అనేది ప్రధానమైన ఘట్టం. అలాంటి ఇల్లు ఇష్ట దైవ మద్దతుతోనే పూర్తవుతుంది. నిత్యం తమకి ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్లే ఏ ఆటంకం లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది. ఇలాంటి అప్పుడు ఆ ఆ దైవానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ దైవంతోనే గృహప్రవేశం చేయాలి. మరి ఏ దేవుడి ప్రతిమతో గృహప్రవేశం చేయాలి?
నేటి కాలంలో దంపతుల మధ్య దేవుళ్ళ విషయంలో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమకు ఇష్టమైన దైవం ఒకరైతే.. తమ దేవుడు మరొకరు అంటూ వాదించుకుంటున్నారు. ఇలా ఇద్దరి మధ్య తగువులు ఏర్పడి వివాదాలు కొనసాగిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఎప్పుడు గానీ ఆడవారు తమ అత్తగారి దేవుడిని ప్రార్థించే అవసరం ఉంది. ఎందుకంటే పెళ్లయిన తర్వాత పుట్టింటి పేరు మారి అత్తింటి పేరు కొనసాగుతోంది. అలాంటప్పుడు అత్తగారింటికి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు కొనసాగించాలి. అలాకాకుండా తమ తల్లి గారి ఆచారాలు, వ్యవహారాలు కొనసాగించాలని ప్రయత్నిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది చాలా దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. కానీ అందరికంటే ముందు కులదైవాన్ని పూజించాలని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వంశం అభివృద్ధి చెందాలన్నా.. అక్కడితో ఆగిపోవాలన్నా కులదైవం అండతోనే ఉంటుంది. ముందుగా కులదైవాన్ని పూజించిన తర్వాతే.. మిగతా దేవుళ్లను పూజించాలి. అలా చేయని పక్షంలో వారి ఆగ్రహానికి గురయ్యే సమస్య ఉంటుంది.
Also Read: చిరంజీవి కి యాక్టింగ్ నేర్పింది నేనే అంటున్న రాజేంద్రప్రసాద్…వైరల్ వీడియో…
అలాగే జీవితంలో ప్రధాన ఘట్టం అయినా గృహ నిర్మాణ సమయంలో కూడా వంశం ఏ దేవుడిని అయితే పూజిస్తారో.. ఆ దేవుడి ప్రతిమ తోనే ఇంట్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అలా చేయడంవల్ల వారి ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎలాంటి కష్టమైనా.. నష్టాలు ఎదురైన ఆ దేవుడే ఆదుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగా కులదైవంను ప్రార్థించిన తర్వాతే మిగతా దేవుళ్లకు పూజలు చేయాలి. అయితే ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఎన్ని దేవుళ్ళకైనా పూజలు చేయవచ్చు. కానీ ముందుగా కుల దైవానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని పెద్దలు చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఎక్కువగా పెళ్లయిన వివాహితులు గుర్తుపెట్టుకోవాలి. అత్తవారింట్లో గతం నుంచి ఏ దేవుడిని అయితే పూజిస్తున్నారో.. ఆ దేవుడికే ప్రాధాన్యమిస్తూ.. ఆ దేవుడితోనే కార్యక్రమాలు ప్రారంభించాలి. అప్పుడే ఏ ఆటంకం లేకుండా పనులు ముందుకు సాగుతాయి. అంతేకాకుండా వారి వంశం అభివృద్ధి కూడా చెంది అవకాశం ఉంటుంది. ఇలా చేయకుండా మిగతా దేవుళ్లను పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉండవని చెబుతున్నారు. అంతేకాకుండా ఏ కష్టం వచ్చినా కులదైవాన్ని ముందుగా ప్రార్థిస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని పేర్కొంటున్నారు.