Rajendra Prasad on Megastar: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన తీసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని ముందుకు తీసుకెళ్లిన నటులలో తను కూడా ఒకడు కావడం విశేషం… ఇక క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరికీ తనే బాస్ అయ్యాడు. చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మెగాస్టార్ గా తనను తాను ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర (Vishwambhara) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చిరంజీవి క్షుణ్ణంగా పరిశీలించి మరి దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను చేస్తున్నాడు. ఈ సినిమా 2026వ సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది… ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కెరియర్ మొదట్లో చెన్నైలో అడయార్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కి సంబంధించిన మెలకువలు నేర్చుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ వాళ్ళది కాగా, సెకండ్ బ్యాచ్ రాజేంద్రప్రసాద్ వాళ్ళందట, ఇక థర్డ్ బ్యాచ్ లో హరిప్రసాద్ లాంటి వారు వచ్చినప్పటికి ఫోర్త్ బ్యాచ్లో చిరంజీవి ఎంటర్ అయ్యారట. ఇక అప్పటికే ఇన్స్టిట్యూట్లో సీనియర్ గా ఉన్న రాజేంద్రప్రసాద్.. ఇన్స్టిట్యూట్ మైమ్ యాక్టింగ్ లో గోల్డ్ మెడల్ ని సాధించారట. ఇక ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆయనకు కొద్దిరోజుల వరకు ఏ అవకాశం రాకపోవడంతో ఏం చేయాలో తోచక ఇన్స్టిట్యూట్లోకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉండేవారట.
Also Read: కాంతార చాప్టర్ 1 మూవీ పోస్టర్ వేరేలేవల్ ఉందిగా… రిషబ్ శెట్టి మరో హిట్ కొట్టబోతున్నాడా..?
ఇక అక్కడ ఉన్న ప్రొఫెసర్ ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు నీ జూనియర్స్ కి క్లాసులు తీసుకొని చెప్పవచ్చు కదా అని అనడంతో ఆయన ఇన్స్టిట్యూట్ కి వెళ్లి మైమ్ క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశారట… చిరంజీవి బ్యాచ్ కి క్లాసులు చెబుతూ మైమ్ లో మెలుకువలు చెపుతుండేవాడట. అలా చిరంజీవికి చాలావరకు మెలుకువలు నేర్పించారట… చిరంజీవి రాజేంద్రప్రసాద్ వెంటపడి మరి మెలకువలు నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపించేవాడట…
ఇక యాక్టింగ్ సంబంధించిన శిక్షణ వేరే వాళ్ళు ఇచ్చినప్పటికీ రాజేంద్రప్రసాద్ మాత్రం మైమ్ నేర్పే వాడని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ చెప్పడం విశేషం…మొత్తానికైతే చిరంజీవి సైతం మైమ్ లో మెలుకువలు నేర్పడంలో రాజేంద్రప్రసాద్ కూడా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి… ఇక ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చేసి మెగాస్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే.
Also Read: హరిహర వీరమల్లు మీద నెగెటివ్ ప్రచారం చేస్తుందేవరు..?
రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలు చేసుకుంటూ నట కిరీటిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ చిరంజీవి రాజేంద్రప్రసాద్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్లో హిట్లర్, డాడీ లాంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి…