House Income:‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్న సామెత అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక ఇల్లు సంతోషంగా ఉందంటే అందుకు కారణం ఆ ఇంట్లోని శ్రీమతినే అని దీని అర్థం. అంటే అవసరమైన సమయానికి ఆహారం అందించడంతోపాటు పిల్లలు, భర్త బాగోగులను ఇల్లాలు మాత్రమే చూసుకుంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి వస్తువులు అవసరం ఉంటాయి? ఇల్లు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాల్లో పురుషులకంటే స్త్రీలు మాత్రమే పర్ఫెక్ట్ గా ఉంటారు. అయితే ఇదే సమయంలో ఆదాయాన్ని కూడా వారే పెంచుతారని ఇప్పుడు అనుకోవాలి.. ఎందుకంటే?
Also Read: చిరుత పులికి ఏమైంది.. చూస్తుండగానే అలా మారిపోయింది.. షాకింగ్ వీడియో
పురుషులు ఉద్యోగం, వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తారు. కానీ చాలామంది వీటిని కాపాడడంలోనూ.. మెయింటెనెన్స్ చేయడంలోనూ పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో అవసరమైన వస్తువులను ఏవి కొనాలి? ఏ విషయంలో డబ్బు వెచ్చించాలి? ఏవి అత్యవసరం? అనే విషయాలు పురుషులకంటే మహిళలకే ఎక్కువగా తెలుస్తుంది. ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 50 శాతం వరకు ఇంట్లో ఖర్చులే ఉంటాయి. అయితే ఈ ఇంట్లో అత్యవసరం అయిన వాటికి.. అవసరం లేని వాటికి.. ఎలా ఖర్చు చేయాలి? అనే విషయాల్లో మహిళలు పకడ్బందీగా ఉంటారని కొన్ని పరిస్థితులను బట్టి తెలుస్తుంది.
ఉదాహరణకు జపాన్ దేశంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆదాయాన్ని పెంచడంలో ముందుంటారు. ఇంట్లో అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో మహిళలే చూసుకుంటారు. కొన్ని రకాల పెట్టుబడుల విషయంలో కూడా మహిళలే చొరవ తీసుకుంటారు. ఇక్కడ పురుషులు తమకు వచ్చిన ఆదాయం మొత్తం స్త్రీలకు ఇచ్చేస్తారు. ఈ విధంగానే భారతదేశంలో కూడా కొన్ని కుటుంబాల్లో ఆర్థిక వ్యవహారాలను మహిళలే చూసుకుంటారు.
Also Read: అవతార్’ బడ్జెట్ ని దాటేసిన హిందీ ‘రామాయన్’ మొదటిభాగం బడ్జెట్..ఎంతంటే!
పురుషులు తమ విధుల్లో పడి మిగతా విషయాలపై పెద్దగా ఫోకస్ పెట్టరు. అయితే మహిళలు మాత్రం వారి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆర్థిక వ్యవహారాలను వారికి అప్పజెప్పితే సరైన విధంగా మెయింటనెన్స్ చేసే అవకాశం ఉందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. ఒక ఇంట్లో ఆడవారికి డబ్బు ఇస్తే వారు బాధ్యతగా ఉంటారు. అంతేకాకుండా తమ కుటుంబం అభివృద్ధి చెందాలని వృధా ఖర్చులు చేయకుండా ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త పడతారు. ఇంట్లోకి ఏ వస్తువులు అవసరమో..? ఏమి అనవసరమో..? వారికి తెలుసు. అందుకే వారు అవసరం ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు. అలాగే పురుషులు తెచ్చే డబ్బును వారు పొదుపు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా భర్త వ్యాపారం చేయాల్సి వస్తే.. ఎంత పెట్టుబడులో పెట్టాలి? అనే విషయాన్ని కూడా స్త్రీలు సలహా ఇస్తూ ఉంటారు. వారి సలహా పాటించిన వారు ఆర్థికంగా నిలదొక్కుకున్న సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అలాకాకుండా సంయమనం పాటించి ఫైనాన్స్ ప్లానింగ్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆదాయం తక్కువగా ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబం సాగుతుంది.