Leopard shocking video:వేట విషయంలో సింహం అత్యంత క్రూరంగా ఉంటుంది. పులి కూడా అదే స్థాయిలో వేటాడుతుంది. కాకపోతే పులి వేటాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఇస్తుంది. ప్రత్యర్థి జంతువుకు ఏమాత్రం అవకాశం ఇవ్వదు. అత్యంత చాకచక్యంగా వేటాడి క్షణాలలోనే ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి దాని మాంసాన్ని చీల్చి చీల్చి తింటుంది. అది మాంసం తింటున్నప్పుడు పొరపాటున ఆ జాడకు ఏ జంతువైనా వస్తే పులికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ సమయంలో అది ఎదురుదాడికి కూడా దిగుతుంది. కోపం మరింత పెరిగితే చంపడానికి కూడా వెనుకాడదు. ఎంత పెద్ద జంతువైనా సరే ఏమాత్రం లక్ష్య పెట్టదు. ఎందుకంటే పులి కోపం ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి.
Also Read: ‘ ఎల్లమ్మ’ సినిమాకి ‘కాంతార ‘ మూవీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?
పులులల్లో చిరుత పులి ప్రత్యేకమైనది.. చిరుత పులి వేటాడుతున్నప్పుడు అత్యంత పకడ్బందీగా ఉంటుంది. స్పష్టమైన అడుగులు వేస్తూ.. దీర్ఘమైన చూపులు చూస్తూ ప్రత్యర్థి జంతువును వేటాడుతుంది. వేటాడే సమయంలో తనకు ఆపద రాకుండా చూసుకుంటుంది. అలాగని జంతువులు వేటాడుతున్నప్పుడు ఏ మాత్రం పొరపాట్లకు అవకాశం ఇవ్వదు.. వేటాడే విషయంలో రకరకాల విన్యాసాలు చేస్తుంది చిరుత పులి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది. ఈ దృశ్యం సౌతాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ సన్నివేశం అత్యంత అరుదైనది. ఎందుకంటే చిరుత పులి అత్యంత ఆరుదైన సందర్భాలలో మాత్రమే ఇటువంటి విన్యాసాలు చేస్తుంది. క్రూగర్ పార్క్ సమీపంలోని కుమానా డ్యామ్ సమీపంలోని మేరీ టార్డాన్ అనే మహిళ సఫారీ కి వెళ్ళింది. ఆ సమయంలో చిరుత పులి విన్యాసాలను ఆమె తన కెమెరాలో బంధించింది.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లోనే సంచలనంగా మారింది. చూస్తుండగానే లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంది.
Also Read: ‘కన్నప్ప’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..ఆల్ టైం డబుల్ డిజాస్టర్!
ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం ప్రకారం చిరుత పులి దట్టమైన పచ్చికలో మేతమేస్తున్న జింకల గుంపును చూసింది. అందులో ఒక జింకను వేటాడాలి అనుకుంది. ఇందులో భాగంగానే జింకల కదలికలను గమనించింది. అయితే తన అలికిడి వింటే జింకలు పారిపోయే ప్రమాదం ఉందని భావించిన చిరుత పులి జాగ్రత్తగా అడుగులు వేసింది. అంతేకాదు తన అలికిడి వినిపించకుండా ముందటి రెండు కాళ్ళను పైకి లేపింది. వెనుక రెండు కాళ్ళ సపోర్టుతో నిలబడింది ఒక రకంగా శునకం లాగా దర్శనమిచ్చింది.. ఆ తర్వాత జింకల మందమీదికి వెళ్ళింది. జింకను వేటాడిందా? లేదా? అని పక్కన పెడితే వేటాడే విషయంలో చిరుత పులికి అద్భుతమైన నైపుణ్యాలు ఉంటాయని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షలలో మంది చూశారు. చిరుత పులి వేట నైపుణ్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. జంతువుల ఛానల్ కి మించి ఇందులో ఉందని.. ఒక వీడియో ద్వారా చిరుతపులిలో ఉన్న స్పెషల్ క్వాలిటీని బయటపెట్టారని ఆ మహిళను నెటిజన్లు కొనియాడుతున్నారు.