Ramayana movie part1: రామాయణం(Ramayanam) మహా గాధని ఉన్నది ఉన్నట్టు పర్ఫెక్ట్ ఎమోషన్స్ తో తియ్యాలే కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ఆదిపురుష్’ చిత్రం అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా దారుణంగా విఫలం అయ్యింది. చరిత్ర ని వక్రీకరించారు అంటూ మేకర్స్ తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టోరీ ని వక్రీకరించడమే కాకుండా, గెటప్స్ ని కూడా వక్రీకరించడం అప్పట్లో పెద్ద వివాదాలకు దారి తీసింది. ‘ఆదిపురుష్’ ఇచ్చిన స్ట్రోక్ కారణంగా భవిష్యత్తులో రామాయణం పై ఎవ్వరూ సినిమాలు తియ్యలేరేమో అని అనుకున్నారు. కానీ ‘దంగల్’ డైరెక్టర్ నితీష్ తివారి(Nitish Tiwari) మాత్రం ఈ మహాగాధని భారీ క్యాస్టింగ్ తో కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాండియర్ తో తెరకెక్కిస్తామని ముందుకు వచ్చారు. అనుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని ఆ విధంగా తెరకెక్కిస్తున్నారు.
మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దాదాపుగా 4000 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు ఆ చిత్ర దర్శకుడు నితీష్ తివారి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో రావణుడి క్యారక్టర్ చేసిన కన్నడ సూపర్ స్టార్ యాష్(Rocking Star Yash) కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట. 4000 కోట్ల బడ్జెట్ అంటే ‘అవతార్'(Avatar Movie) చిత్రానికి జేమ్స్ కెమరూన్ కూడా ఖర్చు చెయ్యని రేంజ్ బడ్జెట్ ఇది. కేవలం పాన్ ఇండియన్ సినిమా అని కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీ రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి(Sai Pallavi), రావణుడిగా యాష్, హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny Deol), సూర్పనక్క గా రకుల్ ప్రీత్,(Rakul Preet singh) దశరధ మహారాజు గా అమితాబ్ బచ్చన్(Amitab Bachchan), రావణుడి భార్య మండోదరి గా కాజల్ అగర్వాల్(Kajal Agarwal) నటిస్తున్నారు. రీసెంట్ గానే విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సినిమా క్వాలిటీ వేరే లెవెల్ లో ఉండబోతున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుందని, కచ్చితంగా ఈ చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. మొదటి భాగం షూటింగ్ కి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. కేవలం గ్రాఫిక్స్ వర్ల్క్ కోసం ఏడాది సమయం కేటాయించాలని మేకర్స్ అనుకుంటున్నారు. వచ్చే ఏడాది దీపావళి రోజు మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు. రెండవ భాగాన్ని 2027 వ సంవత్సరం దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం లో రావణుడు సీతని అపహరించడం, రాముడు రావణుడిని వధించి సీతని అయోధ్యకు తీసుకొని వచ్చే ఘట్టాలను చూపిస్తే, రెండవ భాగంలో రాముడు సీతని అడవులపాలు చేసి మనోవేదనకు గురి అవ్వడం, లవకుశ ఇతివృత్తం, సీత భూమిలోకి వెళ్లిపోయిన తర్వాత రాముడు తనువు చాలించడం వంటివి చూపించబోతున్నారు.