Raja Singh Resigns: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చివరికి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధినాయకత్వం వెంటవెంటనే రాజీనామా ఆమోదించడంతో అందరూ ఊహించిన పరిణామమే.పార్టీ అధ్యక్ష ఎన్నిక అనంతరం రాజీనామా చేసిన తరువాత బహిరంగంగా పార్టీ అధినాయకత్వంపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు త్వరగా రాజీనామా ఆమోదించేందుకు తోడ్పడ్డాయి. అయితే రాజాసింగ్ పార్టీకి బై బై చెప్పేస్తాడని పార్టీ అధిష్టానం ముందే ఊహించినట్లుంది. అందుకే వెంటనే ఆమోదించింది. రాజీనామా చేసిన తరువాత బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయలేదంటే పార్టీలో ఆయన పరిస్తితి అర్థమవుతోంది.
తెలుగుదేశం నుంచి కార్పొరేటర్ గా గెలిచి బీజేపీలో చేరిన రాజాసింగ్ ను పార్టీ అధినాయకత్వం అక్కున చేర్చుకుంది. పార్టీకి గుండెకాయ లాంటి గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. పార్టీ చెప్పినట్లుగా నడుచుకుంటూ, ఒక కట్టర్ హిందుత్వ వాదిగా మంచిపేరు తెచ్చుకున్న ఆయన ఈ మధ్యకాలంలో పార్టీ లైన్ విడిచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన వ్యక్తి గా రాజసింగ్ కు పార్టీ పెద్దల వద్ద మంచి పేరు ఉంది. పార్టీ లైన్ దాటి బహిరంగంగా విమర్శించడం తప్పనే విషయం ఎన్నో ఏళ్లుగా పార్టీ లో ఉన్న ఆయన కు తెలుసు. అంటే రాజసింగ్ పార్టీ లైన్ లో లేడనే విషయం గత 6 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉంది. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారని అందరికీ తెలిసిన విషయమే.
Also Read: Teenmar Mallanna New Party: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. వచ్చే ఎన్నికల్లో నైనా పోటీ చేస్తుందా?
రాష్ట్ర అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు
ఎవరికి పడితే వారికి పార్టీ పగ్గాలు అప్పగించే ప్రక్రియ ఏ పార్టీలో ఉండదు. ముఖ్యంగా బీజేపీ లో ఇలాంటి ప్రయోగాలు అసలు చేయరు. ఒక అధ్యక్ష పదవికి ఒక నాయకుడిని నియమించడం వల్ల ఎంత వరకు పార్టీ ప్రయోజనాలు ఉంటాయనే విషయాలపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. పార్టీ ఎదుగుదల, భవిష్యత్ ప్రణాళిక ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేస్తారు. ఒక పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, మంత్రులుగా నియమించడం, చివరికి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే విషయంలో తర్జన భర్జనల కన్నా ఎక్కువగా పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే విషయంలో సుదీర్ఘ చర్చ అంతర్గతంగా జరుగుతుంది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నాయకులకు సంబంధించి అన్ని కోణాలలో పూర్తి సమాచారం తీసుకుని ఒక నిర్ణయానికి వస్తారు.
ఆ నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే, అందరిని కలుపుకొని ముందుకు వెళ్లగలరా లేదా అనే విషయమే కాకుండా, ఆయన గుణగణాలు, ఏ పరిస్థితితులోనైన పార్టీ నియమాలకు కట్టుబడి ఉండగలగడం. పార్టీ నిర్ణయాలను తూచా తప్పకుండా అమలుపర్చడం. ఇలాంటి ప్రాథమిక విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. పార్టీ లో ఉన్న సామాన్య కార్యకర్త నుంచి అధినాయకత్వం వరకు గౌరవప్రదంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న వారి అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకుంటారు.
Also Read: Kavitha: బీఆర్‌ఎస్‌లో కవిత ఒంటరి..
ఇన్ని ఏళ్లుగా పార్టీలో ఉన్న రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ఒక్క నాయకుడు కూడా బలపరచలేదంటే రాజా సింగ్ ఎక్కడ విఫలమయ్యాడు అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. అయితే ఈ విషయాలు తెలిసినా కావాలని అధినాయకత్వంపై విమర్శలు గుప్పించడం ఆయన చేసిన మరో తప్పిదం. కారణాలు ఏమైనా రాజా సింగ్ పార్టీకి దూరమయ్యే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. గోషామహల్ నుంచి తాను తప్ప బీజేపీకి ప్రాతినిధ్యం లేదని, పార్టీ కార్యాలయం గోషామహల్ పరిధిలో ఉంది కనుక ప్రతి పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించాలని, పార్టీకి నియోజకవర్గంలో తానే పెద్ద దిక్కు అని, నేను ఏది చేసినా నడుస్తుందని అనుకున్నట్లు వ్యవహరించడం వల్ల కూడా మైనస్ అయినట్లు తేలుస్తోంది.