HomeజాతీయంHoli 2023 : హోళీ వేళ.. మీ ఫోన్ ను కాపాడుకోండి ఇలా..

Holi 2023 : హోళీ వేళ.. మీ ఫోన్ ను కాపాడుకోండి ఇలా..

Holi 2023 : అరచేతిలో ఇమిడే ఫోన్ లో మన సమస్తం ఉన్నాయి. మాటల నుంచి బ్యాంకింగ్ దాకా.. వాట్సాప్ నుంచి చాట్ పీజీటీ దాకా.. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ అనేది మన జీవితం లో ఒక భాగం అయింది. అలాంటి ఫోన్ కు ఏదయినా అయితే.. ఇంకేమైనా ఉందా? హోలీ… అంటేనే రంగుల రంగేళీ.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఉత్సాహం లో మునిగి తేలే పండగ ఇది. రంగులు పూసుకోవడం, నీళ్ళు చల్లుకోవడం ఈ పండుగ లో పరిపాటి.. ఇలాంటప్పుడు ఫోన్, ఇతర గాడ్జెట్‌లపై జాగ్రత్తలు పాటించాలి. హోళీ వేడుకల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైనా పాడయినా.. ఏ కంపెనీ ఎలాంటి వారంటీ ఇవ్వదు. వేడుకల్లో భాగంగా ఒకవేళ పొరబాటున ఫోన్ నీటిలో పడితే లేదా తడిగా ఉంటే, ఈ సాధారణ చిట్కాలు మీ ఫోన్‌ను రక్షించడంలో సహాయ పడతాయి.

ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి

ఫోన్ నీళ్లల్లో పడ్డా లేదా నీటి చెమ్మ తగిలినా వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లో చార్జింగ్ పెట్టకండి. చార్జింగ్ పెట్టిన వెంటనే ఫోన్ ఆన్ చేసేందుకు ప్రయత్నించకండి. ఎందుకంటే అది షార్ట్ సర్క్యూట్ కు దారితీయవచ్చు. కొంతమంది ఎలాగూ ఫోన్ ఆన్ అయింది కాబట్టి అందులో యాప్స్ ఓపెన్ చేసి వాడుతుంటారు. ఇది సరయిన పద్ధతి కాదు. ఫోన్ తడిచిన వెంటనే దాన్ని కవర్ లేదా ప్రొటెక్టివ్ పౌచ్ కూడా తీసేయండి. దీనివల్ల కవర్ లో ఉన్న నీరు, ప్రొటెక్టివ్ పౌచ్ కు ఉన్న తేమ ఫోన్ లోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఇలా చేయని పక్షంలో కవర్ లో ఉన్న నీరు, తేమ ఫోన్ లోకి వెళ్ళి దానిని పని చేయకుండా చేస్తుంది. కవర్, పౌచ్ ను తొలగించిన తర్వాత ఫోన్ ను శుభ్రంగా తుడవండి.. తుడిచే క్రమంలో ఫోన్ ను గట్టిగా రుద్దకండి. దీనివల్ల నీరు లేదా తేమ పొరపాటున ఫోన్ సున్నితమైన భాగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చార్జింగ్ ఫోర్ట్, సిమ్, మైక్రో ఎస్డీ లో నీరు లేదా తేమ వెళ్ళకుండా చూసుకోవాలి.

ఆపిల్ ఫోన్ కనుక మీరు వాడుతున్నట్టయితే..

ఆపిల్ ఫోన్ కనుక మీరు వాడుతున్నట్టయితే అందులో ఉన్న సపోర్ట్ సిస్టం ఫోన్ ను ఆరబెట్టాలని సూచిస్తుంది. ఫోన్ లో ఉన్న కనెక్టర్ ను సున్నితంగా నొక్కితే నీరు బయటకి వెళ్ళిపోతుంది. నీరు మొత్తం బయటకి వెళ్ళింది అనుకున్నాకే దాన్ని ఛార్జ్ చేయాలి. లేకుంటే ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఆపిల్ ఫోన్ ఆరిన 5 గంటల తర్వాతే చార్జింగ్ పెట్టాలి. మరో వైపు ఫోన్ ను తుడిచిన తర్వాత అదే పని గా కదిలించ కూడదు. చాలా మంది ఫోన్ తేమ ను తొలగించేందుకు హెయిర్ డ్రైయర్ ను వాడతారు. దీనివల్ల ఫోన్ లోపలి ఎలక్ట్రాన్స్ భాగాలు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు ఫోన్ ను ఒక అన్నం గిన్నెలో ఉంచవచ్చు. అది ఫోన్ లో తేమను గ్రహిస్తుంది. లేదా బియ్యం సంచి లో ఉంచినా ఉపయుక్తంగా ఉంటుంది. బియ్యం తేమను గ్రహిస్తాయి. అందులో పెట్టే ముందు ఫోన్ ను ఓ కవర్ తో చుట్టి 20-24 గంటల వరకు ఉంచితే ప్రయోజనం ఉంటుంది. ఇలాంటప్పుడు ఫోన్లోకి బియ్యం, దుమ్ము, ధూళి వెళ్లకుండా చూసుకోండి. వీలు ఉంటే సిలికాన్ జెల్ ప్యాకెట్లనలో ఫోన్ ను చుట్టి బియ్యం లేదా అన్నం గిన్నెలో ఉంచండి. అవి నీటిని తొలగించేందుకు ఉపయోగపడతాయి..ఇలా రెండు నుంచి నాలుగు రోజులు చేసిన తర్వాత మీ ఫోన్ ను ఆన్ చేయండి. ఇవన్నీ చేసినా ప్రయోజనం లేకపోతే సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లండి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper