
Trivikram -Devi Sri Prasad: టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ అద్భుతంగా ఉంటాయి, వాటిల్లో త్రివిక్రమ్ – దేవిశ్రీప్రసాద్ కలయిక ఒకటి.అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’ సినిమాలోని పాటలు రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసింది.ఆ సినిమా తో ప్రారంభమైన వీళ్లిద్దరి కలయిక ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వరకు కొనసాగింది.త్రివిక్రమ్ తన కెరీర్ లో ఎక్కువ సార్లు రిపీట్ చేసిన ఏకైక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే.అలాంటి అద్భుతమైన కాంబినేషన్ ని ఇప్పుడు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ బాగా మిస్ అయ్యిపోతున్నారు.
Also Read: Gang Leader Re Release: ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ 3 రోజుల వసూళ్లు..ఇంత తక్కువ వసూళ్లను ఊహించలేదు!
ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దేవిశ్రీ ప్రసాద్ ని పూర్తిగా పక్కన పెట్టి, థమన్ ని తన ఆస్థాన సంగీత దర్శకుడిని చేసేసాడు.’అరవింద సమేత వీర రాఘవ’ సినిమాతో ప్రారంభమైన వీళ్లిద్దరి కాంబినేషన్ నేటికీ కొనసాగుతూనే ఉంది.అసలు త్రివిక్రమ్ కి అంత బాగా కలిసొచ్చిన దేవిశ్రీప్రసాద్ ని ఎందుకు పక్కకి నెట్టేశాడు..? అనేది అభిమానుల్లో ఎప్పటి నుండో మెలుగుతున్న ప్రశ్న.
అయితే వీళ్లిద్దరు గొడవపడి విడిపోయారని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో జోరుగా ప్రచారం సాగుతున్న వార్త.గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అనే సినిమా వచ్చింది.ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు రీ రికార్డింగ్ విషయం లో త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ పై అసంతృప్తి ని వ్యక్తపరిచాడట.అనుకున్న సమయానికి పని పూర్తి అవ్వలేదని, రీ రికార్డింగ్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదని త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ తో మొహం మీదనే చెప్పేశాడట.

దీనితో దేవిశ్రీ ప్రసాద్ ఈగో దెబ్బతినింది,ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళింది.ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ కల్పించుకొని గొడవ ని సర్దుబాటు చేసి సినిమాని పూర్తి అయ్యేలా చేసాడు.ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు, అలా టాలీవుడ్ ఆడియన్స్ కి మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ మిస్ అయ్యింది.భవిష్యత్తులో కూడా వీళ్లిద్దరు కలిసే సూచనలు లేవనే చెప్పాలి.
Also Read:Sania Mirza- Ram Charan: టెన్నిస్ కి సానియా మీర్జా గుడ్ బై… ఎమోషనల్ అయిన రామ్ చరణ్!