spot_img
Homeక్రీడలుVirat Kohli: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలివే..

Virat Kohli: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలివే..

Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్టుల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ఈ ప్రకటన చేశాడు. కాగా, ఆయన తప్పుకోవడానికి గల కారణాలను కోహ్లీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్టులో వివరించాడు.

Virat Kohli
Virat Kohli

విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓటమి తర్వాతనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీని వన్ డే కెప్టెన్సీ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది. కాగా, తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తనంతట తాను తప్పుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి రాజీనామా చేయడానికి గల కారణాలను కోహ్లీ వివరించాడు. తాను ప్రతీ విషయంలో 120 శాతం పని చేయాలనుకుంటానని, అలా చేయకపోతే తనంతట తానే తప్పుకుంటానని తెలిపాడు. అలా ఆ విషయంలో స్పష్టంగా ఉన్నాను కాబట్టే తాను నిజాయితీగా వన్ డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడు.

Also Read:  కెరీర్ మధ్యలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ వీళ్లే..

తాను టెస్టు జట్టు కెప్టెన్ గా తప్పుకోవాల్సిన సమయం ఇదేనని, తన ప్రయాణంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే, తన ప్రయత్నాలు, విశ్వాసం మాత్రం ఎన్నటికీ క్షీణించలేదని పేర్కొన్నాడు. తాను ఎల్లప్పుడూ ప్రతీ దానిలో 120 శాతం ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటానని, అలా చేయలేకపోతే తన తప్పుంటుందని భావిస్తానని కోహ్లీ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంత కాలం తన దేశానికి నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకుగాను బీసీసీఐకి విరాట్ కోహ్లీ థాంక్స్ చెప్పారు.

తనకు తొలి రోజు నుంచి ఉన్న దృక్పథాన్ని విశ్వసించి, తనను నమ్మిన సహోద్యోగులకు కూడా తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కోహ్లీ అన్నాడు. తన ప్రయాణాన్ని చిరస్మరణీయంగా, అందంగా మార్చారని, రవి భాయ్‌తోపాటు సపోర్ట్ గ్రూప్‌లోని వారందరికీ థాంక్స్ చెప్పారు. కెప్టెన్‌గా తనపై ఎంతో నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విరాట్ కోహ్లీ. మొత్తంగా విరాట్ కోహ్లీ తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను సవివరంగానే ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నాడు.

Also Read:అందుకే ఆ పార్టీతో సఖ్యత.. లెక్కలేసుకున్న జగన్..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper