Homeఆంధ్రప్రదేశ్‌YS Jaganmohan Reddy: అందుకే ఆ పార్టీతో సఖ్యత.. లెక్కలేసుకున్న జగన్..?

YS Jaganmohan Reddy: అందుకే ఆ పార్టీతో సఖ్యత.. లెక్కలేసుకున్న జగన్..?

YS Jaganmohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతతోనే ఉన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీపై కాలు దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పలు పార్టీల నేతలను కలుస్తున్నారు. కాగా, జగన్ మాత్రం బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. కాగా, ఆ విషయం జగన్‌కు కలిసొస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినట్లయితే బీజేపీకి ఫ్రంట్‌లో లేని పార్టీల మద్దతు కూడా అవసరముంటుంది. అలా అవసరమైనప్పుడు బీజేపీకి జగన్ మద్దతు తెలపాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాక వైసీపీ వైఖరి ఏంటనేది స్పష్టంగా తేలుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Aloso Read:  కెరీర్ మధ్యలో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ వీళ్లే..

ఒకవేళ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్లయితే జగన్ కు ఆ విషయం కలిసొస్తుందని, అలా రాష్ట్రానికి కావల్సిన కొన్ని పనులు అయినా జగన్ కేంద్ర సహకారంతో చేయించుకోగలడని కొందరు చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఫ్రెండ్‌గా ఉండాలని జగన్ భావిస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. అయితే, ఈ ఫ్రెండ్ షిప్ బహిరంగంగా మాత్రం బయటపడటం లేదు. ఇప్పటికి అయితే ఏపీలో బీజేపీకి అఫీషియల్‌గా పొత్తులో ఉన్న పార్టీ జనసేన. కాగా, అన్ అఫీషియల్‌గా వైసీపీ పొత్తులో ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

గతంలో కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలకు వైసీపీ మద్దతు తెలిపింది కూడా. కాగా, భవిష్యత్తులో బీజేపీతో పొత్తుకు వైసీపీ ప్రయత్నిస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇకపోతే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు రెడీ అంటున్నదని వార్తలొస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయం బాగా హీటెక్కింది. జనసేన, బీజేపీలతో పొత్తుకు తాము రెడీ గా ఉన్నామనే సంకేతాలను ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబు ఇచ్చారనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది.

Aloso Read: కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై వ్యవసాయ రంగ నిపుణుల సూచనలేంటి.. ఆశిస్తున్నదేంటి?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular