Homeప్రవాస భారతీయులుUSA: అగ్రరాజ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాది కోసం దుండగుడి వీరంగం.. చివరకు ఏమైందంటే..?

USA: అగ్రరాజ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాది కోసం దుండగుడి వీరంగం.. చివరకు ఏమైందంటే..?

USA:  అగ్రరాజ్యం అమెరికాలో తుపాకితో పాటు ఇతర పేలుడు పదార్థాలు కలిగి ఉన్న దుండగుడు వీరంగం సృష్టించాడు. అతడి వీరంగం చూసి అమెరికా ప్రజలు భయపడిపోయారు. అలా సుమారు పది గంటల పాటు దుండగడు భయాందోళనలను క్రియేట్ చేశాడు. ఇంతకీ అలా అతడు ఎందుకు చేశాడంటే..

USA
USA

అమెరికాలోని డల్లాస్‌కు కూతవేటు దూరంలో ఉన్న కొలీవిల్ సిటీలోని ‘సినగాగ్’గా పిలువబడే యూదుల ప్రార్థనా మందిరం ఉంది. ఇందులోకి పేలుడు పదార్థాలు కలిగి ఉన్న దుండగుడు ప్రవేశించాడు. అలా అక్కడికి వెళ్లిన తర్వాత అందులో ఉన్న మతగురువుతో పాటు నలుగురు వ్యక్తులను బందీలుగా చేసుకున్నాడు. ఆ తర్వాత వీడియోను బయటకు వదిలాడు.

Also Read: అందుకే ఆ పార్టీతో సఖ్యత.. లెక్కలేసుకున్న జగన్..?

అమెరికా జైలులో ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాది ఆఫియా సిద్దిఖీని వదిలిపెట్టాలని డిమాండ్ చేశాడు. అలా చేస్తేనే తను మత గురువుతోపాటు మిగతా నలుగురిని విడిచిపెడతానని బెదిరించాడు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశాడు. ఇక సమాచారం అందుకున్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు..సెపరేట్ బృందాలుగా ఏర్పడి కోలీవిల్ సిటీకి చేరుకున్నారు. అలా దుండగుడితో చర్చలు స్టార్ట్ చేశారు.

ముష్కరుడి వద్ద ఆయుధాలున్నాయా? లేదా ? అనేది ధ్రువీకకరించుకునేందుగాను ప్రత్యేక బలగాలు ప్రయత్నించాయి. దుండగుడితో చర్చలు జరుపుతున్న సమయంలో ఎఫ్ బీఐ వారు ఆ విషయాలను అంచనా వేసుకున్నారు. అలా బందీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకుగాను ఆచి తూచి వ్యవహరించారు. అలా ఒక్కో బందీని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకుగాను ప్రయత్నిస్తున్న క్రమంలో దుండగుడు తొలుత ఓ బందీని విడుదల చేశాడు.

అలా ఒక్కొక్కరిగా బందీలను విడిపించిన క్రమంలోనే దుండగుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. అయితే, నిజంగానే దుండగుడిని హతమార్చారా? లేదా? అనేది అఫీషియల్ గా అయితే, తెలియరాలేదు. కానీ, బందీగా ఉన్న మత గురువుతో పాటు మరో నలుగురు సురక్షితంగా బయటకు రావడంతో కథ సుఖాంతం అయింది. కొలీవిల్ సిటీలో జరిగిన ఈ ఘటన విషయాలను శ్వేతసౌధం పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ఘటన విషయాలను ఎప్పికప్పడు అడిగి తెలుసుకుంటున్నారని సమాచారం.

Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలివే..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Jaggareddy:  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత అయినా అందరూ ఒక్కటిగా ఉంటారని అనుకున్నారు. కానీ, అది సాధ్యం కాలేదు. కాగా, సొంత పార్టీలోనే నేతల మధ్య విభేదాలు ఇంకా ఎక్కువయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ క్రమంలోనే తన దైన బాటలో నడుస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular