Walls Colour Vastu: మీ ఇంటి గోడలకు ఈ రంగులు వేశారా.. అయితే అలాంటి కష్టాలు తప్పవట!

Walls Colour Vastu:  ఇంటి గోడల రంగుల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇంటి గోడలకు వేసే రంగులు వాస్తు ప్రకారం మన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటి బయట గోడలకు క్రీమ్, ఆరెంజ్, యల్లో, వైట్, బ్లూ కలర్స్ ను, ఇతర లేత కలర్స్ ను వినియోగించవచ్చు. వాస్తు ప్రకారం గోడలకు రంగులను ఎంచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. ఇంట్లో పిల్లో కవర్లు, బెడ్ షీట్, కర్టెన్ […]

Written By: Navya, Updated On : December 26, 2021 9:16 am
Follow us on

Walls Colour Vastu:  ఇంటి గోడల రంగుల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇంటి గోడలకు వేసే రంగులు వాస్తు ప్రకారం మన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటి బయట గోడలకు క్రీమ్, ఆరెంజ్, యల్లో, వైట్, బ్లూ కలర్స్ ను, ఇతర లేత కలర్స్ ను వినియోగించవచ్చు. వాస్తు ప్రకారం గోడలకు రంగులను ఎంచుకుంటే ఎలాంటి సమస్యలు రావు.

ఇంట్లో పిల్లో కవర్లు, బెడ్ షీట్, కర్టెన్ రంగులు సైతం గోడల రంగును బట్టి ఉంటే మంచిది. భవిష్యత్తులో పెద్దపెద్ద సమస్యలు రాకుండా ఉండాలంటే చిన్నచిన్న విషయాలపై కూడా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఇంటిలోని వాయువ్య దిశలో తెలుపు, క్రీమ్, లేత బూడిద రంగులను వాడాలి. ఇంటిలోని పశ్చిమ గోడకు నీలం రంగును ఉపయోగించాలి. ఈ గోడకు కొంత తెలుపు రంగును కూడా వాడితే మంచిదని చెప్పవచ్చు.

నైరుతి గోడకు గ్రీన్ కలర్, ఆఫ్ వైట్ లేదా బ్రౌన్ కలర్స్ ను వాడవచ్చు. నైరుతి గోడను నైర్త్య కోణం అని కూడా అంటారు. దక్షిణం వైపు ఉండే గోడకు మాత్రం ఆరెంజ్ కలర్ ను వాడాలి. ఇక్కడ బెడ్ రూమ్ ఉంటే గులాబీ రంగును వాడవచ్చు. ఆరెంజ్ కలర్ ను వాడితే శక్తితో పాటు ఉత్సాహంగా ఉంచడంలో ఈ రంగు తోడ్పడుతుంది. ఇంట్లోని ఆగ్నేయ గోడకు వైట్, యల్లో, ఆరెంజ్ కలర్స్ ను వాడవచ్చు.

ఇంట్లోని తూర్పు గోడకు లైట్ బ్లూ లేదా వైట్ కలర్ ను వాడాలి. శివునికి దిక్కుగా ఇంట్లో ఈశాన్య గోడను భావిస్తారు. ఈ దిశలో గోడలు యల్లో కలర్ లేదా వైట్ లేదా ఊదా రంగులో ఉండాలి. ఉత్తరం వైపున స్కై బ్లూ లేదా పిస్తా ఆకుపచ్చ, లేత ఆకుపచ్చను వాడవచ్చు. ఈ రంగులు కాకుండా వేరే రంగులను ఉపయోగిస్తే మాత్రం ఆర్థిక, ఆరోగ్య, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: ఈ ఫొటోలో ఉన్న జంతువుని కనిపెట్టగలరా ? తెలివైన వారు మాత్రమే చెప్పగలరు ..!