Homeఎంటర్టైన్మెంట్Hero Siddardh: సినిమా పరిశ్రమపై ఎందుకు ద్వేషం అంటూ సిద్ధార్థ్‌ ట్వీట్..

Hero Siddardh: సినిమా పరిశ్రమపై ఎందుకు ద్వేషం అంటూ సిద్ధార్థ్‌ ట్వీట్..

Hero Siddardh: తెలుగు తమిళంలో భాషలో ఎటువంటి సిని బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు హీరో సిద్ధార్థ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ ఉంటున్నారు. గత కొంత కాలం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్లు ఈ విషయంలో కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే.దీనిపై రెండు మూడు రోజుల క్రితం తనదైన స్టైల్లో ఏపీ ప్రభుత్వంపై సిద్ధార్థ్ కౌంటర్ వేసిన విషయం తెలిసిందే.

Hero siddardh comments about film industry goes viral

తాజాగా మరోసారి ట్వీట్లు చేశారు సిద్ధార్థ్. “ఆడియన్స్‌ని అలరించేది ఏదైనా ఎంటర్‌టైన్‌మెంటే అయినప్పుడు క్రికెటర్ల జీతాల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నాడు. సినీ పరిశ్రమపైనే ఎందుకంత ద్వేషమని ప్రశ్నించాడు.ధరలు తగ్గించే  ఉద్దేశంతో స్టార్‌ హోటల్స్‌ నిర్మించాలనుకునేవారికి లాడ్జీల నిర్మించడానికే పర్మిషన్లు ఇస్తారా? బయట క్యాంటీన్లలో దొరికే  ధరలకే అక్కడి ఆహారాన్ని అందించాలని చెబుతారా? భూముల ధరలను ఎందుకు నియంత్రించడం లేదు?  క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్‌ ధరలను ఎందుకు తగ్గించడం లేదు? నటుల పారితోషికాన్ని ప్రశ్నించినప్పుడు ఒక క్రికెటర్‌ జీతాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? క్రికెటర్లలో ప్రతిభ ఉంటే నటీనటులకు ఏముంది?

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడైనా ఎంటర్‌టైన్‌మెంటే..! సినిమాపైనే మీరు ఎందుకు ద్వేషం చూపిస్తున్నారు. ప్రైమ్‌ టైమ్‌లో క్యాబ్‌లు ఎక్కువ మొత్తంలో ఎందుకు వసూలు చేస్తుఅన్నాయి. డ్రెస్‌లు, సెల్‌ఫోన్లలో కొత్త మోడల్స్‌కు ఎక్కువ ధరలు ఎందుకు ఉంటున్నాయి. సినిమావాళ్లు కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు చూపించడానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌ మాత్రం పెట్టుబడికి తగినట్లుగా ధరలు పెట్టుకోకూడదా? ప్రభుత్వం వైఖరి, పన్ను స్లాబ్‌ల వల్ల సినిమా రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న టికెట్‌ రేట్లకు కరెంట్‌ బిల్లు కూడా రాదు. ఇకనైనా సినిమా పరిశ్రమను వదిలేయండి’’.అంటూ మరోసారి మండిపడ్డారు సిద్థార్‌.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version