spot_img
Homeఎడ్యుకేషన్Google Layoffs: గూగుల్ కు ఎంత కష్టం వచ్చింది.. ఏంటి పరిస్థితి

Google Layoffs: గూగుల్ కు ఎంత కష్టం వచ్చింది.. ఏంటి పరిస్థితి

Google Layoffs: మన ఏ చిన్న సమాచారం కోసమైనా గూగుల్ మీద ఆధారపడతాం.. ఏ చిన్న సమస్యను పరిష్కరించుకోవాలన్నా గూగుల్ వైపు చూస్తాం. అక్కడిదాకా ఎందుకు ఉదయం లేచి చేసే బ్రౌజింగ్ నుంచి.. జిపిఎస్ లోకేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లే దాకా అన్నింటా మనకు గూగుల్ సహాయపడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే గూగుల్ మన జీవితాల్లో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంది అలాంటి గూగుల్ కు పెద్ద కష్టం వచ్చింది.. ఆర్థిక మాంద్యం దెబ్బకు గజగజా వణికి పోతుంది. నిన్న మొన్నటి దాకా ఏం కాదు, మరేం పర్వాలేదు అని దగ్గర నుంచి వామ్మో… మా కిందకు కూడా నీళ్లు వస్తున్నాయి అనే స్థాయికి పరిస్థితి దిగజారింది. మునుముందు ఇది ఎలా ఉంటుందో తెలియదు గానీ… ఇప్పుడైతే సంస్థ ఉద్యోగులపై కత్తి వేలాడుతూనే ఉంది.

Google Layoffs
Google Layoffs

మాంద్యం వెంటాడుతున్న నేపథ్యంలో

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు లే_ ఆఫ్ లు ప్రకటించాయి.. కొద్దిరోజుల క్రితం గూగుల్ కూడా పదివేల మంది ఉద్యోగులపై వేటు వేయనుందనే వార్తలు వచ్చాయి.. ఈ తరుణంలో ఆ సంస్థ ఉద్యోగులు సీఈవో సుందర్ పిచాయ్ వద్ద లే_ ఆఫ్ ల గురించి స్పష్టత ఇవ్వాలని ప్రస్తావించారు. ఈ సమయంలో ఆయన భవిష్యత్తు గురించి తాను స్పష్టంగా చెప్పబోనని వివరించారు.

Google Layoffs
Google Layoffs

ముప్పు తప్పదు

వాస్తవానికి టెక్ కంపెనీలకు ప్రధానాదాయం కొనుగోళ్ళ ద్వారా వస్తుంది. యూరో జోన్ లో అనిశ్చిత పరిస్థితులు, అమెరికన్ మార్కెట్ లో ధరల పెరుగుదల, ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఇవన్నీ కూడా… మార్కెట్ ను అతలాకుతలం చేస్తున్నాయి.. దీంతో చాలావరకు ప్రకటనల ఆదాయం గూగుల్ కోల్పోవాల్సి వస్తోంది. దీంతో కంపెనీ ఆదాయం పడిపోతున్నది. అయితే ఉద్యోగుల తొలగింపు పై గూగుల్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. రాబోయే రోజుల్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం మందిని తొలగిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే కంపెనీ అంచనాలకు అనుగుణంగా పనిచేయని ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని పలు విభాగాల మేనేజర్లను కోరినట్లు సమాచారం.. పనితీరు సరిగా లేని ఉద్యోగులను గుర్తించేందుకు గూగుల్ కొత్త మేనేజ్మెంట్ సిస్టాన్ని కూడా పరిచయం చేసినట్టు తెలుస్తోంది. ఆ నివేదికల ఆధారంగా కొత్త సంవత్సరంలో తొలగింపులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ప్రస్తుతం గూగుల్ కు సంబంధించిన వివిధ సంస్థల్లో 1,87,000 మంది పనిచేస్తున్నారు.. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ను నెమ్మదిగా చేయాలని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల లే ఆఫ్ వార్తలను నిజం చేస్తున్నాయి. అయితే మునుముందు ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper