spot_img
Homeఎంటర్టైన్మెంట్Inaya Sultana - RJ Surya: ఆ కోరిక అణుచుకోలేక నేరుగా సూర్య దగ్గరకు వెళ్ళిపోయిన...

Inaya Sultana – RJ Surya: ఆ కోరిక అణుచుకోలేక నేరుగా సూర్య దగ్గరకు వెళ్ళిపోయిన ఇనయా… రొమాంటిక్ పిక్ వైరల్!

Inaya Sultana – RJ Surya: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు కేవలం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. హౌస్లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, కీర్తి ఉన్నారు. వీరిలో ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురు మాత్రమే. బుధవారం వరకు పోలైన ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఒకరిని ఎలిమినేట్ చేయనున్నట్లు నాగార్జున వెల్లడించారు. ఈ విషయం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా తెలియదు. ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. జస్ట్ ఫైనల్ కి ముందు హౌస్ వీడే ఆ అన్ లక్కీ కంటెస్టెంట్ ఎవరో చూడాలి.

Inaya Sultana - RJ Surya
Inaya Sultana – RJ Surya

కాగా 14వ వారం ఇనయా ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆదిరెడ్డి-ఇనయా డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఇనయా ఎలిమినేటైనట్లు నాగార్జున వెల్లడించారు. హౌస్లో లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఇనయా ఎలిమినేషన్ విమర్శల పాలైంది. శ్రీసత్య కంటే కూడా ఇనయాకు తక్కువ ఓట్లు వస్తాయంటే మేము నమ్మం. ఇనయాది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఇనయా హౌస్లో సూర్యకు దగ్గరైన విషయం తెలిసిందే. కన్ఫెషన్ రూమ్ లో సూర్యపై నాకు క్రష్ ఉందని నేరుగా చెప్పింది. ఒక రెండు వారాలు సూర్య-ఇనయా ఓ రేంజ్ లో రొమాన్స్ కురిపించారు. ఇనయాతో ఒక ప్రక్క రిలేషన్ ఎంజాయ్ చేస్తూనే సూర్య టాస్క్, గేమ్స్ నిర్లక్ష్యం చేయలేదు. ఇనయా మాత్రం సూర్య పిచ్చిలోనే బ్రతికేసింది. ఈ క్రమంలో నాగార్జున ఆమెకు క్లాస్ పీకాడు. నాగార్జున వార్నింగ్ తర్వాత సూర్య, ఇనయా ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు.

Inaya Sultana - RJ Surya
Inaya Sultana – RJ Surya

దూరంగా ఉంటున్నట్లు నటిద్దాం అని చెప్పుకున్నారు. దీనిలో భాగంగా సూర్యను ఇనయా నామినేట్ చేసింది కూడా. అదే వారం సూర్య ఎలిమినేట్ కావడంతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. హౌస్లో ఉన్నన్నాళ్లు ఇనయా సూర్య జ్ఞాపకాలతో బ్రతికేసింది. ఇక ఎలిమినేటైన ఇనయా వెంటనే సూర్యను కలిసింది. ఇద్దరూ రొమాంటిక్ గా దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్నాళ్లు సూర్యకు దూరంగా ఉన్న ఇనయా అతన్ని కలిసేవరకు ఆగలేకపోయింది. ఇక ఈ బిగ్ బాస్ ప్రేమికుల ప్రయాణం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. అయితే ఇనయా, బుజ్జమ్మ నాకు మిత్రులు మాత్రమే.. పెద్దవాళ్ళు చూసిన అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని సూర్య చెప్పడం కొసమెరుపు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper