Good News For Youth: బైకుల్లో రారాజుగా నిలుస్తుంది బుల్లెట్ బండి. ఈ బైక్ పై వెళ్లాలని ప్రతీ యూత్ కోరుకుంటారు. ఒకప్పుడు బుల్లెట్ బండికి మహా క్రేజ్ ఉండేంది. మధ్యలో కొన్నాళ్ల పాటు ఆగి ఇప్పుడు దీనిని కొత్త తరహాలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షిస్తున్నాయి. అయితే వినియోగదారులకు అనుగుణంగా.. వారు కోరుకునే విధంగా ఫీచర్స్ తో పాటు సౌకర్యాలను చేర్చి మరికొన్ని బైక్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బుల్లెట్ బండ్లను మార్కెట్లోకి తీసుకురావడంలో రాయల్ ఎన్ ఫీల్డ్ ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి అతి త్వరలో మూడు కొత్త బైక్ లు అందుబాటులోకి రానున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
లగ్జరీ బైక్ లను తీసుకురావడంలో Royan Enfield కంపెనీ ప్రత్యేకత చాటుకుంటుంది. దీని నుంచి ఇప్పటికే ఎన్నో మోడళ్లను ఉన్నా.. కొత్తగా 350 ‘CC, 450 CC, 650 CC, బైక్ లు తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ కు అనుగుణంగా వీటిని మార్చారు. యూత్ కోరుకునే విధంగా ఫీచర్స్ ను అమర్చారు. ఈ బైక్ లు ఎలా ఉన్నాయంటే?
Royan Enfield నుంచి ఇప్పటికే Himalaya బైక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 450 CC ఇంజిన్ తో ఉన్న ఈ మోడల్ ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా అమ్ముడు పోతున్న వాటిలో ఒకటిగా నిలిచింది. అయితే ప్రస్తుతం కాలంలో చాలా మోటార్ వెహికల్ కంపెనీలో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.దీంతో ఈ బైక్ లను కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ లో తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా Himalaya Electric ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఇది మార్కెట్లోకి రావడానికి సమయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదే కంపెనీ నుంచి Itereceptor Bear 650 అనే బైక్ కూడా యూత్ ను ఆకర్షించడానికి రెడీ అవుతంోది. దీనిని నంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ బైక్ నేటి కస్టమర్లు కోరుకునే అన్నీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో స్టాండర్డ్ టెలిస్కోప్ యూనిట్ తో పోలిస్తే కొత్త బైక్ లో అప్డేట్ ఫీచర్స్ అదిరిపోయే అవకాశం ఉంది. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ బైక్ గోల్డెన్ ఫినిషింగ్ లో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలవనుంది.
యూత్ ను ఆకర్షించేందుకు రెడీ అవుతున్న మరో బైక్ Classic 650. Royan Enfield కంపెనీ నుంచి రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటున్న బైక్ లల్లో ఇది కూడా ఉంది. అయితే ఇందులో అప్డేట్ ఫీచర్స్ అమర్చి కొత్తగా మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. 648 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ఉన్న ఈ బైక్ లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ను అమర్చారు. వీటితో పాటు Bullet 650 ని కూడా వినియోగదారులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం 350 సీసీతో ఉన్న ఈ బైక్ ను 650 సీసీగా మార్చి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. అయిే దీనిని 2025లో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.