YSR Family: ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తి వివాదం సంచలనం రేపుతోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ సీఎం జగన్, పిసిసి అధ్యక్షురాలు షర్మిల మధ్య సాగుతున్న ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. వైయస్ కుటుంబ ఆస్తులు ఎవరికి దక్కుతాయి అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు చేసిన కామెంట్స్ కొత్త విశ్లేషణలకు దారితీస్తోంది. ప్రధానంగా షర్మిలకు కొండంత అండగా నిలుస్తోంది. పెళ్లయిన ఆడపిల్లల హక్కులపై హైకోర్టు చేసిన కామెంట్స్.. ఈ ఆస్తుల వివాదంలో కీలకంగా మారనుండి. రాష్ట్రంలో కారుణ్య నియామకాల విషయంలో పురుషులకు, మహిళలకు వ్యత్యాసం ఉంటుందని.. తల్లిదండ్రుల కుటుంబంతో వేరైనా తర్వాత ఆడపిల్లలకు ఆస్తుల్లో హక్కు ఉండదనే చర్చ బలంగా నడుస్తోంది. ఇటువంటి తరుణంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కారుణ్య నియామకాలు చేపట్టే విషయంలో లింగ భేదం ఉండదని.. పెళ్లితో వేరైనంత మాత్రాన తల్లిదండ్రుల కుటుంబంతో ఆడపిల్లలకు హక్కులు ఉండవని వాదనను సైతం కోర్టు తోసి పుచ్చడం విశేషం. కారుణ్య నియామకాల్లో పురుషుడు, మహిళలను వేర్వేరుగా చూడాలన్న వాదన సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. తల్లిదండ్రుల కుటుంబంతో కుమార్తె స్థానాన్ని పెళ్లి అనేది అంతం చేయలేదని కూడా స్పష్టం చేసింది. పెళ్లయిన కూతురు తమ తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం అనలేదని కూడా పేర్కొంది.
* హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆడపిల్లకు పెళ్లి జరిగినా.. జరగకపోయినా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమేనని హైకోర్టు తేల్చి చెప్పడం విశేషం. దీంతో అంతా వైయస్సార్ కుటుంబంలో జరుగుతున్న వివాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తనకు రావాల్సిన ఆస్తులను స్వరార్జితం పేరుతో జగన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు, చేసిన కామెంట్స్ ను పరిగణలోకి తీసుకుని షర్మిల మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో తన నలుగురు మనవాళ్లకు, మనవరాళ్లకు తన ఆస్తి దక్కాలని భావించిన సంగతి గుర్తు చేస్తున్నారు విజయమ్మ. అయితే ఇవ్వాల్సింది ఇచ్చేసామని.. ఇవ్వడానికి ఏమీ లేదని జగన్ చెబుతున్నారు. దీంతో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.
* ఇదో కొత్త మలుపు
అయితే ఈ ఆస్తి వివాదంతో ఎక్కువ నష్టం జరిగేది జగన్ కే. ఆస్తులు ఇవ్వకుంటే లాభపడేది ఆయనే. కానీ ఆయనపై జరుగుతున్న ప్రచారంతో పొలిటికల్ డామేజ్ అవ్వడం ఖాయం. మరోవైపు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించడానికి షర్మిల సిద్ధపడుతుండడం విశేషం. సరిగ్గా ఇదే సమయంలోనే హైకోర్టు తండ్రి కుటుంబంలో సైతం ఆడపిల్లకు చోటు ఉంటుందని.. పెళ్లయినంతమాత్రాన వారు హక్కులు కోల్పోతారు అన్నది తప్పు అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించింది హైకోర్టు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లు అయ్యింది.