Homeఆంధ్రప్రదేశ్‌Donald Trump: అమెరికాలో ఫైనల్‌ ఫైట్‌.. ట్రంప్ గెలిస్తే యుద్ధాలు ఆగుతాయా?

Donald Trump: అమెరికాలో ఫైనల్‌ ఫైట్‌.. ట్రంప్ గెలిస్తే యుద్ధాలు ఆగుతాయా?

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గెలుపు ఎవరిదో ప్రీపోల్‌ సర్వేలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. సెప్టెంబర్‌ వరకు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు లీడ్‌ ఇచ్చాయి. అక్టోబర్‌లో రిబప్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు లీడ్‌ ఇచ్చాయి. ఈ క్రమంలో తుది పోరులో విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. అక్టోబర్‌ 30తో ముగిసిన ప్రచారం మరింత హీట్‌ను పెంచింది. పరిస్థితి చూస్తుంటే మాత్రం వార్‌ వన్‌సైడ్‌లా లేదు. నెక్‌ టూ నెక్‌ పోటీ ఖాయం. దీంతో ప్రపంచమంతా ఇప్పుడు అమెరికావైపే చూస్తోంది. అధ్యక్షలుగా గెలిచేవారిని బట్టి ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతలు ఏ మలుపు తిరుగతాయో అన్నది కూడా ఆసక్తి గా మారింది.

కీలక ప్రాంతాలపై దృష్టి..
అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం కమలా హారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రాంతాలపై దృష్టిపెట్టారు. 16 కోట్ల మంది ఓటర్లలో 2.10 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటు వేశారు. మిగతావారు నవంబర్‌ 5న తమ తీర్పు వెల్లడించనున్నారు. ఎన్నికల్లో తలస్త ఓటర్లు, స్వింగ్‌ స్టేట్స ఓటర్లు కీలకంగా మారారు. వారి ప్రసన్నం కోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

స్వల్ప తేడా..
ఇప్పటి వరకు ట్రంప్‌పై హారిస్‌ స్వల్ప తేడాదో ముందజలో ఉన్నారు. యునైటెడ్‌ స్ట్సేలోని అన్ని ప్రధాన అధ్యక్ష ఎన్నికల సగటు తీసుకునే పోలింగ్‌ ట్రాకర్‌ 538 ప్రకారం.. డెమొక్రటిక్‌ అభ్యర్థి హారిస్‌ విస్కాన్సిన్‌లో 48.2 శాతం ఓట్లు సాధించారు. రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ 47.4 శాతం ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య 3 నుంచి 5 శాతం తేడా ఉంది. దీంతో ఎన్నికల్లో గెలుపు ఎటువైపు మొగ్గ చూపుతుందని అనేది ఉత్కంఠ రేపుతోంది.

అబార్షన్ అంశం కీలకం..
ఇక ఈ ఎన్నికల్లో మహిళలకు అబార్షన్‌ హక్కు అనేది కీలకంగా మారబోతోంది. దీనిని నిషేధిస్తామని ట్రంప్‌ అంటున్నారు. అబార్షన్‌పై నిర్ణయం మహిళలకే ఉండాలని కమలా హారిస్‌ అంటున్నారు. దీంతో మహిళలు ఈసారి అధ్యక్ష ఎన్నికలతోపాటు అబార్షన్‌ విషయంలో కూడా ఓటు వేయనున్నారు. ట్రంప్‌ గెలిస్తే అబార్షన్లపై నిషేధం అమలవుతుంది. కమలా గెలిస్తే అబార్షన్‌ నిర్ణయాధికారం మహిళలకు దక్కుతుంది.

స్వింగ్‌ స్టేట్స్‌ కీలకం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్‌ స్టేట్స్‌ ఎటుమొగ్గితే వారే విజయం సాధిస్తున్నారు. ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచిన వారే అధ్యక్షులు అవుతారు. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్‌ కాలేజీలో 538 ఓట్లు ఉన్నాయి. వీటిలో 270 ఓట్లు సాధిస్తే విజయం వరిస్తుంది. దేశంలో కొన్ని రాష్ట్రాలు డెమొక్రట్లాకు, కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ఏడు స్వింగ్‌ స్టేట్స్‌ మాత్రం తమ నిర్ణయాన్ని తరచూ మారుస్తున్నాయి.

యుద్ధాలు ఆగుతాయా..
అమెరికాలె ఎవరు అధ్యక్షులు అయితే యుద్ధం ఆగుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ట్రంప్‌ గెలిస్తే రష్యా–ఉక్రెయిన్‌ యుద్దం ఆగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం చేస్తోంది. నిధులు అందిస్తోంది. ట్రంప్‌ గెలిస్తే ఈ సాయం ఆపేస్తారని భావిస్తున్నారు. దీంతో యుద్ధానికి ముగింపు పలుకుతారని తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్‌ యుద్ధంపైనా ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆమెరికాకు ఆర్థిక నష్టం కలిగంచే విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. కమలా గెలిస్తే.. యుద్ధాలు మరికొంతకాలం కొనసాగుతాయని పేర్కొంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version