Weather Report: భారత దేశం వ్యవసాయ దేశం. పూర్తిగా వర్షాధారంగానే దేశంలో ఎక్కువ శాతం పంటలు సాగవుతాయి. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద కూడా భూములు సాగవుతున్నాయి. అయితే మన దేశంలో వర్షాలు ఎక్కువశాతం రుతుపవనాల ఆధారంగానే కురుస్తాయి. జూన్ నుంచి అక్టోబర్(October )వరకు నైరుతి రుతుపవనాల ఆధారంగా వర్షాలు కురుస్తాయి. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాల ఆధారంగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు ఆలస్యంగా నిష్క్రమించాయి. రుతుపవనాల నిష్క్రమణపై వారం రోజుల నుంచి పలు దఫాలు భారత వాతావరణ శాఖ ప్రకటనలు చేస్తూ వచ్చింది. చివరకు ఈ విషయాన్ని సోమవారం నిర్ధారించింది. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్(December,)31 వరకు ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. రుతుపవనాలు జనవరి వరకు కొనసాగినా.. వర్షాలు మాత్రం డిసెంబర్‌లోనే ఆగిపోయాయి. ప్రస్తుతం దక్షిణ బారతంలోని తమిళనాడు, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాకల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. పొడి వాతావరణం నెలకొనడం సముద్రం నుంచి తేమ గాలులు తగ్గడంతో ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణాధిలోని ఐదు సంబ్ డివిజన్లలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనే 30 శాతం నమోదవుతుంది. ఒక్క తమిళనాడులోనే 48 శాతం వరకు వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 15న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఒక తీవ్ర తుఫాన్, ఒక తుఫాన్, మరో మూడు వాయుగుండాలతోపాటు రెండు తీవ్ర అల్పపీడలనాలు, రెండ అల్పపీడనాలు ఏర్పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇలా..
రాష్ట్రం వరకు చూస్తే.. ఈ సీజన్‌లో 286.5 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 316.5(10 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. కోస్తాలో 322.3 మి.మీలకు 292.3 మి.మీల (సాధారణం కన్నా 9 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. ఇక రాయలసీమలో 234.7 మి.మీలకు 344.4.మి.మీలు(46 శాతం ఎక్కువ) నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలో 173.1 మి.మీకి 360.8(108 శాతం ఎక్కువ) వర్షంపాతం నమోదంది. కర్నూలులో 140.2 మి.మీలకు 103.7 మి.మీ(29 శాతం తక్కువ), కోస్తాలో నెల్లూరులో 574 మి.మీలకు 736.6(28 శాతం ఎక్కువ) వర్షం కురిసింది. ఉత్తర కోస్తాలో సాధారణం కన్నా తక్కువ రవ్షం నమోదైంది. ఈ సీజన్‌లో తమిళనాడును వరదలు ముంచెత్తాయి. అనేక జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది.
ఆగమనం, నిష్క్రమణ రెండూ ఆలస్యమే..
వాతావరణ మార్పుల ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. నిష్క్రమణ కూడా ఆలస్యంగా జరిగిందని వాతావణ శాఖ అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. సుమారు పదేళ్ల నుంచి నైరుతి, ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణలో జాప్యం జరుగుతుందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు వాయువ్య భారతం నుంచి నిర్ణీత తేదీకన్నా ఆలస్యంగా నిష్క్రమిస్తున్నాయి. ఆ ప్రభావం ఈశాన్య రుతుపవనాలపై పడుతోంది. ఈశాన్య రుతుపవనాల సీజన్ డిసెంబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడి తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. వాతావరణ 6పభావంతో వేడెక్కిన సముద్రాల నుంచి వచ్చే గాలుల ప్రభావంతో తీరప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పాండిచ్చేరిలో అతిభారీ వర్షాలు కురిశాయి.