Vastu Tips: దైనందిన కార్యక్రమాల్లో రోజూవారీ పనులతో పాటు కొన్ని ఆచార, వ్యవహారాలు కూడా పాటించాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని పనుల వల్ల అదృష్ట, దురదృష్టాలు వెంటాడుతాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది. మనకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల దురదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించిన వాళ్లవముతాం. అందువల్ల జ్యోతిష్య శాస్త్రం గురించి తెలుసుకొని కొన్ని పద్ధతులను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. లేకుంటే ఎంత కష్టపడ్డా ఇంట్లో ఎప్పుడు కష్టాలే మిగులుతాయని కొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల దురదృష్టాన్ని ఇంట్లోకి రమ్మని పిలిచినట్లేనని అంటున్నారు.
‘పుణ్యం కొద్ది పురుషులు..దానం కొద్ది బిడ్డలు’ అన్నారు పెద్దలు. ఇతరులకు అన్నం, వస్తువులు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఆహారం, వస్తు రూపంలో ఇతరుల అవసరాలు తీర్చడం వల్ల దైవానుగ్రహం పొందుతారు. ఈ క్రమంలో కొందరు తమకు తెలియకుండా కొన్ని వస్తువులను దానం చేస్తూ ఉంటారు. ఈ వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం విషయమేమో గానీ దరిద్రం మాత్రం ఇంట్లో వచ్చి చేరుతుందని అంటున్నారు. ఆ వస్తువుల్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువంగా ఉంటుంది. వాటిని ఇతరులకు దానం చేయడం వల్ల ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇతరులకు ఇచ్చి నెగెటివ్ ఎనర్జీని తెచ్చుకుంటారని అంటున్నారు.
నేటి కాలంలో చేతికి ఎవరూ వాచ్ పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు మగవాళ్ల ఆభరణం మాదిరిగా వాచ్ ఉండేది. ఇది ఉపయోగకరంగా ఉండడంతో పాటు అలంకరణగా ఉండేది. అయితే చేతి వాచ్ ను ఎవరికి దానం ఇవ్వకూడదట. వాచ్ పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అందువల్ల దీనిని దానం చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో వాడిన చీపురును ఇతరులకు దానం ఇవ్వొద్దు. చీపురును లక్ష్మీ దేవతగా భావిస్తారు. దీనిని ఇతరులకు ఇవ్వడం వల్ల దరిద్రాలు వస్తాయంటున్నారు.
ఇంట్లో పెరిగిన మనీ ప్లాంట్ మొక్కను ఎవరికీ దానం ఇవ్వొద్దట. ఇలా ఇవ్వడం వల్ల ఇంట్లోని శుభాన్ని ఇతరులకు ఇచ్చినట్లే అవుతుందని చెబుతున్నారు. వాడిన దుస్తులు కూడా దానం చేయొద్దని అంటున్నారు. అందువల్ల ఇతరులకు దానం ఇచ్చే విషయంలో కాస్త ఆలోచించండి. దానం చేసే వస్తువుతో ఎదుటివారి అత్యవసరం తీరుతుందంటే, తప్పదు అంటే ఆలోచించాలి. కానీ అనవసరంగా ఇలాంటి వస్తువులను మాత్రం ఇతరులకు దానం చేసి నష్టాల పాలు కావద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.