Husband And Wife Relationship: మనుషులంతా ఒకే జాతికి చెందిన వారు. కానీ ప్రతీ మనిషిలో ప్రత్యేకత ఉంటుంది. తన ఆలోచనలు, ప్రవర్తన ఎప్పుడూ పక్కవారితో పోలిక ఉండదు. కానీ ఇతరులతో బంధాలను కలుపుకోవాలంటే కొన్నింటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి రిలీషన్ అవసరం లేదంటే ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. అలాంటప్పుడు బంధాలను పెంచుకుంటూ పోవాలి.. తుంచేసుకోవద్దు. అయితే ఇలా బంధాలు తెగిపోకుండా ఉండాలంటే కొన్ని లక్షణాలను వదిలేయాలి. అప్పుడు మనమీద ఎదుటి వారికి నమ్మకం కలుగుతుంది. కానీ కొందరు కొన్ని పనులు వద్దన్నా చేస్తారు. ఇలా చేయడం వల్ వారి దగ్గరి వెళ్లాలంటేనే అసహ్యం కలుగుతుంది. మరి అలా బంధాలను చెడగొట్టేవి ఏవో తెలుసా?
ప్రతి మనిషి చేసే కార్యానికి మెదడుతో సంబంధం ఉంటుంది. మైండ్లో వచ్చే ఆలోచనతోనే అవయవాల ద్వారా పనులు చేస్తుంటాం. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా అన్నీ పనులు చేయగలుగుతాం. అదే కోపతాపాలు, ఈర్ష్య ద్వేషాలు ఉండడం వల్ల ఎలాంటి పనులు చేసే శక్తి రాదు. ముఖ్యంగా ఎదుటి వారి గురించి మన మనసులో ఉండే అభిప్రాయమే ఒక్కోసారి అది బయటకు వస్తుంది. ఇలా మైండ్ లో ఉండే రెండో భాగాన్నే సైలెంట్ కిల్లర్స్ అని కూడా ఉంటారు. ఇలాంటి వాటితోనే రిలేషన్ బ్రేక్ అవుతుంది. అయితే కొన్నింటిని మనం మార్చుకోవడం ద్వారా ఈ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఎదుటివాళ్ల గురించి మనకున్న అభిప్రాయాన్ని వెంటనే తెలియజేయండి. ఉదాహరణకు భాగస్వామిపై ఒక విషయంలో కోపం వస్తుంది. దీనిని అప్పుడే బయటపెట్టకుండా దాచుకోవడం ద్వారా మనసులో ఏదో నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది లోలోపల పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి తుఫానులా ఒక్కోసారి బయటకు వస్తుంది. ఇలా ప్రతీ విషయాన్ని మనసులో దాచుకోకుండా ఎప్పటికప్పుడు బయటపడే విధంగా చూసుకోవాలి.
ఇతరుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం సబబే. కానీ ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఈ తరుణంలో ఎదుటివారి గురించి కొన్ని అంచనాలు వేసి వారికి నచ్చని పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల నమ్మకం పోతుంది. ఫలితంగా రాను రాను బంధాన్ని తెంచుకునే స్థాయికి వస్తుంది. కొన్ని చిన్న చిన్న విషయాల్లో భేదాబిప్రాయం ఏర్పడినప్పుడు దానిని అక్కడితోనే తుంచేయండి. దీనిని అలాగే లాగిస్తే పెద్ద గొడవగా మారి రిలేషన్ షిప్ కట్ అవుతుంది. చాలా విషయాల్లో భాగస్వామితో నేను వేరు నీవు వేరు అన్నట్లుగా ప్రవర్తించొద్దు. మనం చేద్దాం అన్న భావనతో ఉండాలి. అప్పుడే బంధుత్వం పటిష్టంగా మారుతుంది.