Virat Kohli Records
Virat Kohli Records: విరాట్ కోహ్లి.. క్రికెట్ కింగ్‌గా గుర్తింపు పొందిన విరాట్.. కొన్నాళ్లుగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. 2019–2022 మధ్యకాలంలో గడ్డుకాలం ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 2022 సెప్టెంబర్లో ఆప్ఘనిస్తాన్‌పై అర్ధశతకం చేశాడు. ఆసియా కప్ టీ20 టోర్నీతో తిరిగి శతకబాట పట్టాడు. కెరీర్లో 71 శతకం కోసం మూడేళ్ల పాటు నిరీక్షించిన కోహ్లి.. ఆతర్వాత సెంచరీ సెంచరీల దిశగా వడివడిగా అడుగులు (ప్రస్తుతం 77 సెంచరీలు) వేస్తున్నాడు.
మూడేళ్లు సెంచరీ లేకుండా..
మూడేళ్లకాలంలో ఒక్క సెంచరీ కూడా చేయలేని కోహ్లి, ఆతర్వాత సరిగ్గా ఏడాది కాలంలోనే ఏడు సెంచరీలు బాది మునుపటి కంటే చాలా ప్రమాకరంగా కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని కోహ్లికి దగ్గరి వారు పలు మార్లు ముందే ప్రస్తావించారు. ప్రపంచ బౌలర్లు కోహ్లిను తట్టుకోలేరు.. మాడి మసైపోతారని వారు ముందే హెచ్చరించారు. వారి అనుగుణంగా ప్రస్తుతం జరుగుతుంది. ఆఫ్గనిస్తాన్‌పై కోహ్లి తన 71వ సెంచరీ చేశాక భీకర ఫామ్ క్రికెట్ ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యపడకపోవచ్చు. సెంచరీ తర్వాత అదే ఏడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో సెంచరీ చేసిన కింగ్ 2022ను 2 సెంచరీలతో ముగించాడు.
2023లో ఆకాశమే హద్దుగా..
ఇక ఈ ఏడాది ఆకాశమే హద్దుగా కోహ్లి చెలరేగిపోతున్నాడు. ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 21 ఇన్నింగ్స్‌లలో 58.42 సగటున 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 1,110 పరుగులు చేశాడు. కోహి ప్రస్తుత భీకర ఫామ్ను చూసి ప్రపంచ బౌలర్లు దడుసుకుంటున్నాడు.
వరల్డ్ కప్ టైంలో..
ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ టైంలో కోహ్లి అరివీర భయంకర ఫామ్ చూసి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి టాప్ జట్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందులోనూ వరల్డ్ కప్ భారత్లోనే జరుగుతుండటంతో వారి భయం పతాకస్థాయికి చేరింది. కోహ్లికి బ్రేకులు వేసేందుకు ఇప్పటినుంచే ఎత్తుగడలు చేసుకుంటున్నారు. కోహ్లి ఇలాంటి ఫామ్‌లో ఉన్నప్పుడు తలవంచుకుని పోవడం తప్పించి చేసేదేమీ ఉండదని తెలిసినప్పటికీ, తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోహ్లి ఇదే ఫామ్‌లో కొనసాగితే, భారత్ ముచ్చటగా మూడోసారి జగజ్జేతగా నిలవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లి వరల్డ్ కప్‌లో ఐదుకుపైగా సెంచరీలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారంటున్నారు.
ప్రమాదకరంగా కోహ్లి 2.O
కోహ్లి 2.O అంటే ఏదో అనుకున్నాం.. మరీ ఇంతలా ప్రమాదకారిగా మారతాడని అనుకోలేదని ప్రపంచ జట్లన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. మరి ఈ ఏడాది కోహ్లి ఇంకెన్ని సెంచరీలు చేస్తాడో వేచి చూడాలి.
సచిన్ రికార్డు బద్దలు
దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్‌కప్–2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్‌కు తన అద్భుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. ఇక తాజా మ్యాచ్‌లో ప్రపంచంలో అంతర్జాతీయ వన్డేల్లో 47వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్‌ను కోహ్లి అధిగమించాడు.