IT employee fell on Road: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ సెక్టార్ జాబ్ అంటే సాలరీలు ఆకాశమంతా ఎత్తులో ఉంటాయి. అంతేకాకుండా ఐటీ చేసిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇలాంటి వారిని కోరి తీసుకుంటూ ఉంటారు. లక్షల నుంచి కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి ఆదరిస్తారు. అయితే మన దేశ ఐటీ నైపుణ్యానికి విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. అలాగే మనదేశంలోని కొన్ని సంస్థలు ప్రతిభ గల వారిని అక్కున చేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉండడంతో.. కొన్ని కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఒక కంపెనీ లేఅవుట్ ప్రకటించింది. దీంతో ఒక ఉద్యోగి అప్పటి వరకు రూ. 70 లక్షల జీతాన్ని పొందాడు. ప్రస్తుతం రోడ్డున తిరుగుతున్నాడు.. అసలు 70 లక్షలు జీతాలు పొందినప్పుడు అతడు ఏమాత్రం సేవ్ చేసుకోలేదా? ఆయన చేసిన తప్పేంటి? ఇప్పటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్న తప్పులేంటి?
ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ అనగానే కోట్ల రూపాయల వరకు జీతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలామంది కష్టపడి చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలను తెచ్చుకుంటున్నారు. అయితే ఎంత ప్రతిభ ఉన్నా.. ఎలాంటి నైపుణ్యాలు ఉన్నా.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అంతగా బాగో లేకపోవడంతో చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసివేయక తప్పడం లేదు. మరి కొన్ని కంపెనీలు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ కంపెనీ లే అవు ప్రకటించడంతో ఉద్యోగి తన 70 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి దారుణంగా తయారైంది అయితే ఆయన ఐటీ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేశాడు. ఆ సూచనలు ఏంటంటే?
ఈ ఉద్యోగికి ఏడాదికి 70 లక్షలు.. అంటే నెలకు కనీసం రూ. నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల జీతం వచ్చే అవకాశం ఉండేది. ఇలాంటి జీతం వచ్చినప్పుడు అతడు లగ్జరీ లైఫ్ను మెయింటైన్ చేశాడు. వృధాగా ఖర్చులు చేశాడు. ఏమాత్రం సేవింగ్ చేయకుండా డబ్బును అవలీలగా ఖర్చు పెట్టేశాడు. అలా ఖర్చుపెట్టిన అతడు ప్రస్తుతానికి కంపెనీ లేయా ప్రకటించగానే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఏడాదికి 70 లక్షల ఆదాయం వచ్చిన అతడు సరైన విధంగా ఆర్థిక ప్రణాళిక వేస్తే కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏ కంపెనీ అయినా శాశ్వతంగా ఉద్యోగం ఇవ్వదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాకుండా నిర్ణీత వయసు వరకు మాత్రమే ఉద్యోగులకు డిమాండ్ ఉంటుంది.. వయసు దాటిపోయిన తర్వాత కంపెనీలు తీసుకోవడానికి ఆసక్తి చూపవు.
అందువల్ల జీతం ఎక్కువగా వచ్చే ఉద్యోగులు ఇప్పటినుంచే సేవింగ్ చేయడం నేర్చుకోండి. వృధా ఖర్చులకు వెళ్ళవద్దు. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయొద్దు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప అప్పులు చేయకూడదు… అని ఆ ఉద్యోగి ఇతరులకు సలహా ఇస్తున్నాడు.