HomeతెలంగాణRestrictions on Telangana police: మాలలు వేసుకోవద్దు.. దీక్షలు స్వీకరించొద్దు.. తెలంగాణ పోలీసులపై ఆంక్షలు!

Restrictions on Telangana police: మాలలు వేసుకోవద్దు.. దీక్షలు స్వీకరించొద్దు.. తెలంగాణ పోలీసులపై ఆంక్షలు!

Restrictions on Telangana police: తెలంగాణ పోలీస్‌.. దేశంలో చాలా రాష్ట్రాలకు మన పోలీసులు ఆదర్శంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నా.. నేరాల నియంత్రణ, శాంతిభద్రత పరిరక్షణలో దేశంలో అనేక రాష్ట్రాల పోలీసులకన్నా ముందు ఉన్నారు. సాంకేతికత వినియోగంలోనూ మన వాళ్లే ముందు. అయితే పోలీసులు కూడా సాధారణ మనుషులే. వారికీ మనసు ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. దీంతో చాలా ఏళ్లుగా కొందరు పోలీసులు అయ్యప్ప, శివ, హనుమాన్‌ దీక్షలు స్వీకరిస్తున్నారు. దీక్ష సమయంలో నియమాలు పాటిస్తున్నారు. యూనిఫాం ధరించడం లేదు. దీనిపై తాజాగా రేవంత్‌ సర్కార్‌ ఆంక్షలు విధించింది.

మతపరమైన వివాదం..
పోలీసులు దీక్షలు, మాలలు స్వీకరించొద్దని, గడ్డాలు, జుట్ట పెంచుకోవద్దని తాజాగా పోలీస్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీటిని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏ మతం ఆచరించొద్దని స్పష్టం చేసింది. యూనిఫాం ధరించాలని, షూస్‌ వేసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు అయ్యప్ప మాలలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖ ఆంక్షలు ఇప్పుడు మతపరమైన వివాదానికి దారితీశాయి.

హిందువలకే ఆంక్షలా..
ఈ ఆదేశాలలో ఎలాంటి మతపరమైన ప్రక్రియలు పాటించవద్దని స్పష్టమైన మేరకు చెప్పబడింది. అయితే ఈ నియమాలు హిందువులకే పరిమితమై ఉన్నాయా అనే ప్రశ్నలకు నిర్వాహకులు, పోలీసులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని మత స్వేచ్ఛపై ముప్పుగా చూస్తున్నారు.ఆంక్షలపై పోలీసులలోనూ కొన్ని అభిప్రాయాలు విభిన్నమయ్యాయి. కొంతమంది నియమాలు అవసరమైన డిసిప్లిన్‌ కిందపడటానికి అనుకూలంగా ఉన్నారని, మరికొందరు మతపరమైన సంస్కతి విషయంలో ఈ నియమాలు సరిగా లేదని అంటున్నారు.

నియమాల వల్ల వివిధ మతాలు, ఆచారాల మధ్య వ్యత్యాసం, సమాజంలో అవగాహన పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాచరణను సమర్థిస్తూ లేదా వ్యతిరేకిస్తూ సామాజిక వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. హిందువుల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో మతపరమైన స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. ఇలా ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version