Free glasses : కాలం మారుతున్న కొద్దీ అందుబాటులోకి కొత్త టెక్నాలజీ వస్తుంది. అయితే ఈ టెక్నాలజీ వల్ల అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. పూర్వికులు ఎవరు చివరివరకు కళ్ళకు అద్దాలు పెట్టుకోవడం అనేది తెలియదు. కానీ నేటి కాలంలో చిన్న పిల్లలు కళ్లద్దాలతో స్కూల్ కి వెళ్తున్నారు. అందుకు వాతావరణం లో వస్తున్న మార్పులతో కారణం తీసుకునే ఆహారం అలాగే మొబైల్, టీవీ చూడడం వంటివి ఉన్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మిగతా సమస్యలతో పాటు కళ్ళ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతానికి దేశంలో 30 కోట్లకు పైగానే కళ్ళజోడు ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే కళ్ళకు పెట్టుకునే అద్దాల లెన్స్ క్లియర్ గా ఉంటేనే కళ్ళు బాగా కనిపిస్తాయి. అందుకోసం ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కళ్లద్దాల లోని లెన్స్ ను ఉచితంగా మార్చుకునే అవకాశం ఇప్పుడు మార్కెట్లో ఉంది. అదెలాగంటే?
కళ్ళకు ఉండే అద్దాలలో లెన్స్ చాలా కీలకమైనవి. చుట్టూ ప్రేమ్ ఎలా ఉన్నా లెన్స్ క్లియర్ గా ఉంటేనే కళ్ళు బాగా కనిపిస్తాయి. లేకుంటే మానసికంగా తీవ్రవేదనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఒక్కోసారి కళ్లద్దాలను అశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచడం వల్ల లేదా అనుకోకుండా లెన్స్ పగిలిపోతూ ఉంటాయి. వీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న అవి పాడైపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే లెన్స్ మార్చుకోవడానికి కనీసం రూ. 500 నుంచి రూ.1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : బీర్లు తాగితే మతిమరుపు రాదట.. త్వరపడండి
అయితే ఇప్పుడు ఓ సంస్థ ఉచితంగానే లెన్స్ మార్చే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆయా నగరాల్లో ఉండే Lenskart అనే ఆప్టికల్ షాప్ లోకి వెళ్లి లెన్స్ ను మార్చుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆయా పట్టణాలు లేదా నగరాల్లో ఉండే షాపుల్లో వీటిని వెంటనే వెళ్లి మార్చుకోవాలని కొందరు చెబుతున్నారు. అయితే షాపులోని లెన్స్ ను ఉచితంగానే ఇస్తారు. కానీ దీని ఫిట్టింగ్ చార్జి మాత్రం రూ.200 తీసుకుంటారు.. సాధారణ షాపుల్లో లెన్స్ చార్జి తో పాటు వీటిని కూడా అదనంగా వేస్తారు. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లెన్స్ కార్డు ప్రతినిధులు తెలుపుతున్నారు.
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు కళ్ళజోడు తప్పనిసరిగా మారింది. కంట్లో ఉన్న సమస్యలతో పాటు మెడ నొప్పులు వంటివి ఉన్నా కూడా.. కళ్ళజోడు అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే కళ్ళజోడులోని లెన్స్ ను మార్చుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే నిర్లక్ష్యంగా ఉండడంవల్ల మానసికంగా ఆందోళనగా ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటేనే కళ్ళు బాగా కనిపిస్తాయి.