Benefits With Beer: ఇటీవల కాలంలో కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మనుషులను పక్కదారి పట్టించేవిగా ఉంటున్నాయి. గతంలోనే కొన్ని పరిశోధనలు రోజుకో పెగ్గు మందు తాగితే ఎలాంటి రోగాలు రావని చెప్పడంతో మందుబాబులు ఉత్సాహంగా మందు తాగడం మొదలెట్టారు. ఇంకా కొన్ని రకాల పరిశోధనలు అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. దీంతో వారు లేని వారు కూడా అలవాటు చేసుకునేందుకు దోహదం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మతిమరుపుకు మంది బీర్లు తాగడమేనని ఓ పరిశోధనలో తేల్చడంతో ఇంకేముంది అందరు బీర్లు తాగేందుకు సిద్ధపడనున్నారు. ఇలా తప్పుదారి పట్టించే విధంగా పరిశోధనలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ మధ్య కాలంలో మందు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఏదో ఓ ఐదు లేదా ఎనిమిది శాతం మంది తాగని వారుంటున్నారు. మిగతా వారందరు సాయంత్రం అయిందంటే చాలు గ్లాస్ మేట్లుగా మారిపోతున్నారు. దీంతో మందు మన దేశంలో విచ్చలవిడిగా అమ్ముడవుతోంది. ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చిపెడుతోంది. వృద్ధులకు అల్జీమర్స్ వ్యాధి వస్తుందని తెలుసు. అందుకే వారిలో ఆ బాధలు లేకుండా చూసుకోవాలంటే వారు బీరు తాగాల్సిందేనని ఈ పరిశోధన సందేశం. దీంతో మందు తాగేందుకు పరోక్షంగా దోహదం చేసే పరిశోధనలు వారిని అందుకు ఉసిగొల్పుతున్నాయనడంలో సందేహం లేదు.
ముదిమి వయసులో మతిమరుపు కామనే. మనిషి ఆయుర్దాయం కూడా తగ్గిపోతోంది. నేటి కాలంలో మనిషి సగటు ఆయుర్దాయం అరవై ఏళ్లే కావడంతో క్రమంగా మనుషుల్లో మార్పులు వస్తున్నాయి. పూర్వం రోజుల్లో వందేళ్లు హాయిగా బతికేవారు. కానీ ప్రస్తుతం యాభై ఏళ్లకే టపా కట్టేస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్దీ మతిమరుపు సహజమే. ఇది ఎందుకొస్తుందంటే నాడీ వ్యవస్థలో అమైలాయిడ్ బీటా, ప్రొటీన్ల నిల్వలు ఎక్కువైతే మతిమరుపు వస్తుంది. దీనికి బీర్లలో వాడే హాప్ అనే పదార్థంతో అల్జీమర్స్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది.

ఈ హాప్ లు హ్యుములస్ లుపులస్ అనే మొక్క పూలు, హాప్ లలో ఉండే సమ్మేళనాలు మతిమరుపుకు విరుగుడుగా పనిచేస్తాయి. దీంతో అల్జీమర్స్ రాకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బీర్లలో వాడే పూలతో మతిమరుపుకు చెక్ పెట్టొచ్చు. మందుబాబులు బీరు తాగి మతిమరుపు నుంచి సురక్షితంగా బయట పడొచ్చని సూచించడంతో మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనలు మందు తాగేందుకు కూడా దోహదం చేస్తున్నాయని పలువురు చెబుతున్నారు.