New Phone in Budget: టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్ది మార్కెట్లోకి కొత్త వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు కీ ప్యాడ్ తో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ గా అభివృద్ధి చెందింది. అయితే ఈ మొబైల్ కాలం మారుతున్న కొద్ది అప్డేట్ అవుతూ కొత్త రకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో యువత ఎక్కువగా కొత్త మొబైల్ ను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్తగా మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ విషయంలో బడ్జెట్ ఎంత పెట్టాలి? దేనికోసం ఎంత వెచ్చించాలి? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే?
Read Also: ఓజీ లో పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవడానికి భయపడిన స్టార్ హీరో…వైరల్ వీడియో…
ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్లు అలరిస్తున్నాయి. కానీ అంతే స్థాయిలో వాటి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు తక్కువ ధరకు అందిస్తున్నా.. యువత మాత్రం ఎక్కువ ధర మొబైల్స్ ని కోరుకుంటున్నారు. అయితే మొబైల్స్ ఎక్కువ ధర ఉండడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వీటిలో అదనపు ఫీచర్స్ తోపాటు.. అదనంగా కొన్ని వస్తువులు ఇవ్వడంతో వాటి ధరలు పెంచుతున్నారు. అయితే అవి కొందరికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అలా ఉపయోగం లేని వారు అధిక ధర పెట్టి మొబైల్ ను కొనుగోలు చేయడం వృధా అవుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఏ ఫోన్ అయినా రూ. 25 వేలకు తక్కువగా లేదు. అయితే కొందరు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు ధర పలికేవి కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని అదనపు ఫీచర్లు ఉంటున్నాయి. ఉదాహరణకు కొన్ని గేమ్స్ కు సంబంధించిన ఫీచర్స్ ను కూడా యాడ్ చేస్తారు. ఇవి ఉండడంవల్ల వీటి ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా అదనపు కెమెరా లేదా ఎక్స్ట్రా స్టోరేజ్.. ఐ కాన్ఫిగరేషన్ ఉండడంతో ధరలు అధికంగా ఉంటాయి.
Read Also: మా ఆయన కూడా అలాంటివాడే, పర్ఫెక్ట్ కాదు, గొడవలు అయ్యాయి… అనసూయ సంచలనం
అయితే సాధారణ ఉద్యోగికి కావాల్సిన మొబైల్ ఏదో ముందే నిర్ణయించుకోవాలి. అంటే ఒక మొబైల్ లో బ్యాటరీ కెపాసిటీ తో పాటు స్టోరేజీ వంటి విషయంలో ప్రధానంగా ఆలోచించాలి. అలాగే ర్యామ్ తో పాటు డిస్ప్లే కూడా అవసరమే. ఇక కెమెరా మనకు అవసరం ఉన్నంత వరకు తీసుకోవాలి. ఇలా అదనపు ఫీచర్లు.. అవసరంలేని కొన్ని యాక్సెస్ సరీస్ వద్దనుకుంటే తక్కువ ధరకే ఫోన్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో తక్కువ ధరలోనే మంచి ఫోన్ కొనుగోలు చేసిన వారవుతారు. అంతేకాకుండా నేటి కాలంలో మొబైల్స్ చోరీకి ఎక్కువగా గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ బడ్జెట్ ఫోన్ కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆదాయం తక్కువగా ఉన్నవారు ఇలాంటి దాదాపు ఫీచర్లను వద్దనుకొని మొబైల్స్ కొంటె వారికి ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా భారం పడకుండా ఉంటుంది.