Lifetime Settlement Offer : ఎంత కష్టపడినా కొంత మంది వద్ద డబ్బులు నిలబడవు. పైగా ఖర్చులకు డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ వార్త కథనం. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చెమట చుక్క చిందించాల్సిన అవసరం లేదు. ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ ఉంటే చాలు 18 లక్షలు మీవే. పైగా ఆ డబ్బులను మీకు పువ్వులు పెట్టి ఇస్తారు. చదువుతుంటే ఆత్రుతగా ఉంది కదూ.. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడో తెలుసుకోవాలని ఉంది కదూ.. అయితే చదివేయండి ఈ కథనం.
ప్రస్తుత రోజుల్లో బయట ఉండాలంటే అద్దె భారీగా చెల్లించాలి. కానీ మీరు అద్దె చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే మీకు డబ్బులు ఇచ్చే విధంగా స్విట్జర్లాండ్ దేశంలో సౌకర్యం ఉంది. స్విట్జర్లాండ్ దేశంలోని ఆల్బినేన్ అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం కొండలకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నివసించడానికి స్విస్ ప్రభుత్వం ఏడాదికి భారతీయ కరెన్సీలో 18 లక్షలు చెల్లిస్తుంది. ఖర్చులకోసం నెలకు 2.5 లక్షలు ఇస్తుంది. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న యువకులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. దీంతో జనాభా పూర్తిగా తగ్గిపోయింది. చాలావరకు గృహాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి స్విస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
స్విట్జర్లాండ్ యూరప్ లో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. ఈ దేశంలో అన్ని ప్రాంతాలు దాదాపు పర్వతాలకు దగ్గరగా ఉంటాయి. ఏడాదిలో ఎక్కువ రోజులు మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ పెద్దగా ఫ్యాక్టరీలు లేవు కాబట్టి కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ ప్రకృతి, వనరులు అత్యంత స్వచ్ఛంగా ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇష్టపడుతుంటారు. పర్యాటక ద్వారానే స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. ప్రపంచంలో పర్యాటక ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించే దేశాలలో స్విట్జర్ ల్యాండ్ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ దేశంలో చాలా గ్రామాలలో యువత పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాల నిమిత్తం.. చదువుల నిమిత్తం అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో చాలావరకు గ్రామాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..
స్విస్ ప్రాంతంలో గ్రామాలే పర్యాటకంగా ప్రధాన ఆదాయ వనరు. అలాంటిది గ్రామాలు ఖాళీగా కనిపిస్తే పర్యాటకులు ఎవరూ రారని స్విట్జర్లాండ్ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే గ్రామాలలో ఉండడానికి.. గ్రామాలలో నివసించే వారి సంఖ్య పెంచడానికి ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే 18 లక్షలు ఇస్తామని చెప్పినప్పటికీ అంతంతమాత్రంగానే స్పందన వస్తోందని తెలుస్తోంది. అయితే గ్రామాలలో జనం తక్కువగా ఉండడం.. ఇరుగు పొరుగు వారికి పెద్దగా సంబంధాలు ఉండకపోవడం వల్లే ఎవరూ అక్కడ నివసించడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.